వాలెంటైన్స్ డే రోజు మీ శ్రీమతికి ఈ బహుమతి ఇస్తే....వచ్చే వాలెంటైన్ డేకి కోటీశ్వరులు అవ్వడం ఖాయం..

By Krishna AdithyaFirst Published Feb 9, 2023, 12:01 PM IST
Highlights

వాలెంటైన్ డే సందర్భంగా మీ శ్రీమతికి ఏదైనా బహుమతి ఇవ్వాలని భావిస్తున్నారా. అందమైన రోజా పువ్వు ఇస్తే అది రేపటిలోగా వాడిపోతుంది. కానీ మరో వాలెంటైన్ డే వచ్చేవరకు మీరు ఇచ్చినటువంటి బహుమతి వారికి కలకాలం గుర్తుండి పోవాలంటే ఈ ప్లాన్స్ వర్కౌట్ చేసి చూడండి.

వాలెంటెన్స్ డే వచ్చేస్తోంది మరి ప్రియమైన శ్రీమతికి ఏం బహుమతి ఇవాళ అని ఆలోచిస్తున్నారా.  అయితే ఓ చక్కటి పరిష్కారంతో మీ ముందుకు వచ్చేసాం.  ఈ వాలెంటైన్స్ డే ని మీ సతీమణి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేలా ఓ చక్కటి బహుమతి ఇవ్వండి.  అది జీవితాంతం గుర్తుండిపోయేలా ఒక బంగారు గుడ్లు బాతు అవుతుంది.
 
మహిళా సమ్మాన్ బచత్ పత్ర (Mahila Samman Saving Certificate Scheme) : 2023 బడ్జెట్లో ప్రవేశపెట్టిన మహిళా బడ్జెట్ సమాన్ పత్ర యోజన మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పథకం.  ఈ స్కీం కింద మహిళల పేరిట రెండు లక్షల రూపాయల వరకు పొదుపు చేసుకునే అవకాశం ఉంది ఈ రెండు లక్షల పైన 7.5% వరకు వడ్డీ లభిస్తుంది నిజానికి ప్రభుత్వం ఆఫర్ చేస్తున్నటువంటి ఈ వడ్డీ బ్యాంకులో అందించే ఫిక్స్డ్ డిపాజిట్ ల కన్నా కూడా ఎక్కువనే చెప్పాలి తద్వారా మహిళలకు ఎక్కువ లాభం కలిగే అవకాశం ఉంది.  ఈ డిపాజిట్ చేసిన సొమ్మును Section 80C  టాక్స్ డిడక్షన్ లో కూడా చూపించుకోవచ్చు.   ఈ స్కీం 2024 వరకు అందుబాటులో ఉంది. ఈ స్కీమ్ లో రెండు సంవత్సరాల వరకు డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.  రెండు సంవత్సరాలు ముగిసిన తర్వాత మీ రూ. 2 లక్షల సొమ్ము రూ. 2,31,125 అవుతుంది. అంటే రూ. 31,125 వడ్డీ రూపంలో ఆదాయం లభిస్తుంది. ఈ డిపాజిట్లో మీరు డబ్బు పెట్టాలనుకుంటే మీ సమీపంలోని పోస్ట్ ఆఫీస్ లేదా ప్రభుత్వ బ్యాంకు ను సంప్రదించండి. 

గోల్డ్ స్కీంలో చేరండి :  బంగారం ధర ప్రతిరోజూ పెరుగుతూ వస్తోంది ఇప్పటికే వసిడి ధర తులం ఏకంగా 57,000 దాటిపోయింది ఈ నేపథ్యంలో బంగారాన్ని ఒకేసారి కొనడం చాలా కష్టమనే చెప్పాలి.  కనుక మహిళలకు ఎంతో ఇష్టమైన బంగారాన్ని మీరు వాయిదాల పద్ధతిలో కొనే అవకాశం ఉంది.  ప్రముఖ జ్యువెలరీ షాపులన్నీ కూడా గోల్డ్ స్కీమ్ లను  ఆఫర్ చేస్తూ ఉంటాయి రెండు వేల రూపాయలు నెలకు 2000 రూపాయల నుంచి ఈ స్కీం లో అందుబాటులో ఉంటాయి 12 నెలల పాటు  ఈ స్కీమ్ లో మీరు తప్పు పొదుపు చేసుకున్న తర్వాత ఆ డబ్బుతో మీరు మీకు నచ్చిన నగరం కొనుగోలు చేసే అవకాశం ఉంది అంటే ఉదాహరణకు ఈ వాలెంటైన్స్ డే రోజు మీరు స్కీం ప్రారంభించి మరుసటి వాలెంటైన్స్ డే నాటికి మీ శ్రీమతికి చక్కటి బంగారు నగలు బహుమతిగా అందించే అవకాశం ఉంది. 

 మీ శ్రీమతి పేరిట మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టండి :  మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి అనేది మార్కెట్ రిస్కులకు లోబడి ఉన్నప్పటికీ, ఇందులో నెలవారి పద్ధతిలో ఫండ్ పెర్ఫార్మెన్స్ ను బట్టి, మీరు ప్రతి నెల వాయిదాల పద్ధతిలో డబ్బులు మదుపు చేసుకోవచ్చు తద్వారా బ్యాంకు వడ్డీ కన్నా  ఎక్కువ మొత్తంలో మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. 
 

click me!