సొంతిల్లు కొనడం అనేది ప్రతి ఒక్కరి కల ఆ కలను నెరవేర్చుకునేందుకు వారు జీవితాంతం డబ్బు కూడా పెట్టాల్సి వస్తుంది. . అయితే డబ్బు కూడా పెట్టి సొంతిల్లు కట్టుకోవడం అనేది చాలా కాలం పట్టే ప్రక్రియ ఈలోగా అదే ఇంటికి అద్దె చెల్లించి డబ్బులు అయిపోతాయి. మీరు కనుక సొంతిల్లు కొనాలి అనుకుంటే హోమ్ లోన్ ద్వారా తీసుకోవడం అత్యుత్తమమైన పని అని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
చాలామంది హోమ్ లోన్ ద్వారా అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు చేస్తే నష్టపోతామేమో అని భయపడుతూ ఉంటారు. కానీ అది ఏ మాత్రం కూడా నష్టం కాదు అన్న సంగతి గుర్తించాలి. నిజానికి అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలంటే మీ కష్టార్జితం లోని డబ్బులు సేవింగ్స్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఖర్చు చేయకూడదు. బదులుగా హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కొనుగోలు చేసినట్లయితే చాలా లాభదాయకం అని చెప్పొచ్చు.
లోన్ తీసుకొని అపార్ట్ మెంట్ కొంటేనే లాభం…ఎలాగంటే..?
ఎందుకంటే బ్యాంకు మీకు రుణం అందిస్తుంది. తద్వారా మీరు తక్కువ డౌన్ పేమెంటుకే సొంత ఇంటిని సొంతం చేసుకోవచ్చు. ఉదాహరణకు మీరు రూ. 50 లక్షలు ఖర్చు చేసి ఒక డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే మీరు 10 లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ కోసం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆపై మీకు 40 లక్షల వరకూ రుణం అలాట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ నలభై లక్షల రూపాయలను మీరు 25 సంవత్సరాల వరకు నెల వాయిదాల పద్ధతిలో లోన్ తీర్చవచ్చు.
ప్రతీ నెల అద్దె పెరుగుతుంది..కానీ EMI పెరగదు..
ఈ లెక్కన చూసినట్లయితే 40 లక్షల రుణానికి 25 సంవత్సరాల పాటు కాల వవ్యధిలో 8.5% వడ్డీకి ప్రతినెల రూ. 32,000 EMI చెల్లించాల్సి ఉంటుంది. అయితే మీకు 32 వేల రూపాయల ఇఎంఐ అంటే ఒక్కసారిగా చాలా భారం అనిపించవచ్చు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే. ఈ 32 వేల ఈఎంఐ అనేది 30 సంవత్సరాల పాటు ఒకేలా ఉంటుంది. ఏమాత్రం తగ్గదు ఏమాత్రం పెరగదు. మొదటి ఐదు సంవత్సరాలు మీకు 32 వేల రూపాయల ఇఎంఐ అనేది కాస్త భారంగా అనిపించవచ్చు. కానీ మీ వేతనం కూడా క్రమంగా పెరుగుతూ ఉంటుంది. ఒక 20 సంవత్సరాల తర్వాత మీరు చూసుకున్నట్లయితే, బయట మీరు చెల్లించే అద్దెలతో పోల్చినట్లయితే ఈఎంఐ అనేది చాలా తక్కువగా అనిపించడం ఖాయం. ఇక చివరగా 25వ సంవత్సరానికి చేరేకొద్ది మీకు ఈఎంఐ ముగిసిపోతుంది. అప్పుడు మీరు గమనించినట్లయితే, అప్పటికి మీ ఫ్లాట్ విలువ కూడా చాలా రెట్లు పెరిగి ఉంటుంది. ఈ 25 సంవత్సరాల్లో మీరు పన్ను మినహాయింపు కూడా పొందుతున్నారు.
అంతేకాదు మీరు ఆ ఫ్లాటును అద్దెకు ఇచ్చినట్లయితే ఈఎంఐ లో దాదాపు సగం పైన భారం మీపై తగ్గుతుంది. అంతేకాదు అదే ఆదాయం ప్రతి సంవత్సరం ఐదు శాతం చొప్పున పెంచిన మీకు చాలా లాభం కలుగుతుంది. మీరు ఆదాయ పన్ను మినహాయింపు పొందాలి. అనుకుంటే దాదాపు 15% వరకు పన్ను ఆదా పొందవచ్చు. ఇక మీకు రీసేల్ వేల్యూషన్ వస్తాయి 25 సంవత్సరాల తర్వాత మీ ఫ్లాట్ వాల్యూ దాదాపు మూడు నాలుగు రెట్లు పెరిగే అవకాశం ఉంది అంటే దాదాపు 50 లక్షల ఫ్లాట్ కోటిన్నర వరకు పోయే అవకాశం లభిస్తుంది.. ఒకవేళ మీరు అసలు వడ్డీ కలిపి చూసిన మీరు చెల్లించేది 96 లక్షల రూపాయలు మాత్రమే కానీ ఈ 25 సంవత్సరాల్లో మీరు అద్దె చెల్లించకుండా ఉన్నారు తద్వారా చాలా డబ్బు ఆదాయం అయింది అని గమనించగలరు. దీంతో పాటు ఆస్తి వేల్యూ కూడా పెరిగింది. అంటే మీరు భవిష్యత్తు కోసం లోన్ తీసుకొని ఆస్తి కొనుగోలు ఫ్లాట్ కొనుగోలు చేయడం ద్వారా చాలా లాభపడ్డారు అని గుర్తించవచ్చు.
భవిష్యత్తుకు మంచి పెట్టుబడి మీ సొంతం..
ఎందుకంటే మీరు ప్రతి ఏటా మీరు చేసే వృత్తిలో ఆదాయం పెరుగుతూ ఉంటుంది దాంతో పోల్చి చూసుకున్నట్లయితే 25 సంవత్సరాల్లో మొదటి నెల భారంగా అనిపించిన నెల వాయిదా చివరి నెలకు వచ్చేటప్పటికి చాలా తక్కువగా అనిపించడం ఖాయం ఆ లెక్కన చూస్తే మీకు నామ మాత్రానికే, ఫ్లాట్ వచ్చినట్టు గమనించవచ్చు ఎందుకంటే ఇందులో మనం లోన్ తీసుకొని చెల్లించాము మన సేవింగ్స్ ను దాచుకొని చెల్లించాల్సి వచ్చినట్లయితే చాలా నష్టపోయే వాళ్ళం ఎందుకంటే సేవింగ్స్ పెట్టుబడిగా పెట్టినట్లయితే ఎక్కువ మొత్తంలో డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. అదే ఇల్లు లోన్ తీసుకొని ఇల్లు కొన్నట్లయితే మీకు పలు విధాలుగా ఉపయోగపడుతుంది మీ సేవింగ్స్ కూడా రక్షించబడతాయి.