నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా.. పంప్‌కు వెళ్లే ముందు లీటరు ధర ఎంతో తెలుసుకోండి..

By asianet news teluguFirst Published May 23, 2023, 10:04 AM IST
Highlights

 భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), మరియు హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) వంటి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) గ్లోబల్ బెంచ్‌మార్క్ ధరలను అనుసరించి ప్రతిరోజు ప్రాతిపదికన ధరలను విడుదల చేస్తాయి.

నేడు అంతర్జాతీయ మార్కెట్ సూచనల మధ్య భారత చమురు కంపెనీలు మంగళవారం మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా కొనసాగించాయి. ఈ రోజు మంగళవారం అంటే మే 23, 2023న ఇంధన ధరలలో ఎలాంటి మార్పు లేదు. ప్రతిరోజూ ఆయిల్ కంపెనీలు పెట్రోల్,  డీజిల్ తాజా ధరలను విడుదల చేస్తాయి. 

 భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), మరియు హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) వంటి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) గ్లోబల్ బెంచ్‌మార్క్ ధరలను అనుసరించి ప్రతిరోజు ప్రాతిపదికన ధరలను విడుదల చేస్తాయి.

ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధర కాస్త తగ్గింది. WTI క్రూడ్ బ్యారెల్‌కు $78కి పడిపోయి, బ్రెంట్ క్రూడ్ ఇప్పుడు బ్యారెల్‌కు $85 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం
అంతర్జాతీయ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా క్రూడాయిల్ ధరలు నిరంతరం తగ్గుతూ వస్తోంది. WTI క్రూడ్ ధర బ్యారెల్‌కు $ 85.61 అండ్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $ 91.63 వద్ద  పడిపోయింది.

గత  ఏడాది మే 21న కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన సంగతి మీకు తెలిసిందే. అప్పట్లో లీటరు పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు. కేంద్రం ప్రకటన తర్వాత రాజస్థాన్, మహారాష్ట్ర, ఒడిశా, కేరళ ప్రభుత్వాలు కూడా వ్యాట్‌ను తగ్గించాయి.

23 మే 2023న పెట్రోల్, డీజిల్ ధరలు : 

ఢిల్లీ:  లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62.

ముంబై:  లీటర్ పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27.

కోల్‌కతా:  లీటర్ పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర రూ.92.76.

చెన్నై:  లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24.

హైదరాబాద్:  లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82.

బెంగళూరు:  లీటర్ పెట్రోల్ ధర రూ.101.94, డీజిల్ ధర రూ.87.89.

తిరువనంతపురం:  లీటర్ పెట్రోల్ ధర రూ.107.71, డీజిల్ ధర రూ.96.52.

పోర్ట్ బ్లెయిర్:  లీటర్ పెట్రోల్ ధర రూ. 84.10, డీజిల్ ధర రూ.79.74.

భువనేశ్వర్:  లీటర్ పెట్రోల్ ధర రూ.103.19, డీజిల్ ధర రూ.94.76.

చండీగఢ్:  లీటర్ పెట్రోల్ ధర రూ.96.20, డీజిల్ ధర రూ.84.26.

లక్నో:  లీటర్ పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.76.

నోయిడా:  లీటర్ పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.96.

జైపూర్:  లీటర్ పెట్రోల్ ధర రూ.108.48, డీజిల్ ధర రూ.93.72.

పాట్నా:  లీటర్ పెట్రోల్ ధర రూ.107.24, డీజిల్ ధర రూ.94.04

గురుగ్రామ్: లీటర్ పెట్రోల్ ధర రూ. 97.18, డీజిల్ ధర  రూ. 90.05 లీటరు.

పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభావితం చేసే కారణాలు

పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్  ఇతర  జోడించిన తర్వాత దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. విదేశీ మారకపు ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ఆధారంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజూ మారుతూ ఉంటాయి.

click me!