ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారికి వేతనం పెంపు..

By Sandra Ashok KumarFirst Published Jul 8, 2020, 11:26 AM IST
Highlights

లాక్ డౌన్ కారణంగా ఆదాయం దెబ్బతిన్న సంస్థలు, పారిశ్రామిక రంగాలు ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగుల తొలగింపు చేపట్టాయి. కానీ దేశంలో రెండవ అతిపెద్ద ప్రైవేటు రంగమైన ఐసిఐసిఐ బ్యాంక్ తన ఉద్యోగులలో 80వేల మందికి 8 శాతం వరకు వేతన పెంపు చేయాలని నిర్ణయించినట్లు ఆ సంస్థ వర్గాలు మంగళవారం తెలిపాయి.

భారతదేశంలో కరోనా వైరస్ రోజు రోజుకి విపరీతంగా విజృంభిస్తుంది. లాక్ డౌన్ కారణంగా ఆదాయం దెబ్బతిన్న సంస్థలు, పారిశ్రామిక రంగాలు ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగుల తొలగింపు చేపట్టాయి.

కానీ దేశంలో రెండవ అతిపెద్ద ప్రైవేటు రంగమైన ఐసిఐసిఐ బ్యాంక్ తన ఉద్యోగులలో 80వేల మందికి 8 శాతం వరకు వేతన పెంపు చేయాలని నిర్ణయించినట్లు ఆ సంస్థ వర్గాలు మంగళవారం తెలిపాయి. కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో వారు అందించిన సేవలను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ బ్యాంక్ వర్గాలు తెలిపాయి.

2020-21 ఆర్థిక సంవత్సరానికి 8 శాతం వరకు వేతన పెంపును జూలై నుంచి వర్తిస్తుందని తెలిపాయి. వేతన పెంపు పొందుతున్న ఉద్యోగులు మొత్తం ఎం1, దిగువ గ్రేడ్‌లకు చెందినవారు, వీరు ఎక్కువగా కస్టమర్ ఫేసింగ్ రోల్స్‌లోని ఫ్రంట్‌లైన్ సిబ్బంది. వారు శాఖల పనితీరును, బ్యాంకు ఇతర కార్యకలాపాలను నిర్ధారిస్తారు.

also read  

అయితే వేతనాల పెంపు అంశంపై బ్యాంకు నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరికొన్ని ఇతర బ్యాంకులు ఉన్నత అధికారుల వేతనాలలో కోత విధిస్తున్నాయి. అయితే అందుకు భిన్నంగా ఐసీఐసీఐ బ్యాంకు ఉద్యోగుల కష్టాన్ని గుర్తించి వారి వేతనాలు పెంచడం అభినందనీయమని కార్పోరేట్‌ వర్గాలు తెలిపాయి.

కరోనా వైరస్ వ్యాప్తి లాక్ డౌన్ వల్ల ఆర్ధిక ప్రభావం కారణంగా ఖర్చులను తగ్గించచుకోవడం అవసరం, అయితే మార్చి చివరి నుండి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కు విధించింది దీంతో ఆర్థిక కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. ఐసిఐసిఐ బ్యాంక్ తన మార్చి త్రైమాసిక నికర లాభంలో 26 శాతం పెరిగి 1,221 కోట్ల రూపాయలను నమోదు చేసింది.

click me!