హైదరాబాద్‌ నుంచి విమాన సర్వీసులు పున:ప్రారంభం.. వారానికి 4 సర్వీసులు..

By Sandra Ashok KumarFirst Published Aug 17, 2020, 8:55 PM IST
Highlights

కోవిడ్-19 వ్యాప్తి కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోయయి. యూకే ప్రభుత్వాల మధ్య కుదిరిన ‘ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ బబుల్ ఒప్పందం ప్రకారం, అంతర్జాతీయ ఎయిర్ కనెక్టివిటీని పున:ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నంలో ఇది ఒక భాగం. 

హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జిఐఎ) ఆగస్టు 17 నుండి యుకెకు ప్రత్యక్ష విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించింది. హైదరాబాద్ నుండి మొదటి విమానం సోమవారం ఉదయం 7:50 గంటలకు లండన్ హీత్రో విమానాశ్రయానికి బయలుదేరింది.

కోవిడ్-19 వ్యాప్తి కారణంగా విమాన సర్వీసులు గత కొన్ని నెలలుగా నిలిచిపోయయి. యూ.కే ప్రభుత్వాల మధ్య కుదిరిన ‘ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ బబుల్' ఒప్పందం ప్రకారం, అంతర్జాతీయ ఎయిర్ కనెక్టివిటీని పున:ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నంలో ఇది ఒక భాగం.

దీంతో విమాన ప్రయాణం క్రమంగా కోలుకునే సంకేతాలను చూపిస్తోంది. హైదరాబాద్-లండన్ కనెక్షన్‌ను తిరిగి ప్రారంభించడం, బ్రిటిష్ ఎయిర్‌వేస్ (బిఎ 276) మొదటి విమానం ఆదివారం హైదరాబాద్ నుండి బయలుదేరింది. యు.కెకు చెందిన విమానయాన సంస్థలు బ్రిటిష్ ఎయిర్‌వేస్ సోమవారం, బుధవారం, శుక్రవారం, ఆదివారాలలో అంటే నాలుగు రోజుల పాటు విమాన సర్వీసులు పనిచేస్తాయి.

also read 

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అన్‌లాక్ 3.0 సమయంలో కరోనా వైరస్ మహమ్మారి వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే లక్ష్యంతో, కేంద్రం “ట్రాన్స్‌పోర్ట్ బబుల్” నిర్మిస్తోంది.

కరోనా మహమ్మారి కారణంగా సాధారణ అంతర్జాతీయ విమానాలను నిలిపివేశారు. బిజినెస్ ప్రయాణీకుల సేవలను పునప్రారంభించే లక్ష్యంతో రెండు దేశాల మధ్య జరిగిన ఇది తాత్కాలిక ఏర్పాట్లు. "ఇంటెర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ బబుల్ ఒప్పందం కింద మా ముఖ్యమైన గమ్యస్థానాలకు విమాన సేవలను తిరిగి ప్రారంభించడం మాకు సంతోషంగా ఉంది.

యూ‌కే ఎల్లప్పుడూ కీలకమైన గమ్యస్థానంగా ఉంది. హైదరాబాద్, లండన్ మధ్య ఈ సంబంధాన్ని తిరిగి ప్రారంభించడం తెలంగాణ, యు.కె దేశాల మధ్య కీలకమైన ఆర్థిక, సామాజిక సంబంధాలను పునరుద్ధరించడానికి సహాయపడుతుంది ”అని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతినిధి ఒకరు తెలిపారు.

బ్రిటిష్ ఎయిర్‌వేస్ ప్రతినిధి మాట్లాడుతూ, “గ్లోబల్ లాక్‌డౌన్ కారణంగా నెలరోజుల అనిశ్చితి ఏర్పడిన తరువాత హైదరాబాద్, యు.కె దేశాల మధ్య మరోసారి ప్రత్యక్ష విమాన ప్రయాణాలను అందించగలిగినందుకు మేము సంతోషిస్తున్నాము.

భారతదేశంలో మా కస్టమర్లలో చాలామంది స్నేహితులు, కుటుంబ సభ్యులతో తిరిగి కలవడానికి వేచి ఉన్నారని మాకు తెలుసు. వారిని తిరిగి బోర్డులో స్వాగతించడానికి మేము ఎదురుచూస్తున్నాము. ” అని అన్నారు.

click me!