క్రూడాయిల్‌ ధరలలో భారీ పతనం.. పెట్రోల్, డీజిల్‌పై మరోసారి ఉపశమనం! ఈరోజు కొత్త ధరలు ఇవే...

By asianet news teluguFirst Published Sep 5, 2022, 9:37 AM IST
Highlights

మహారాష్ట్ర, మేఘాలయ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ మూడున్నర నెలలుగా చమురు ధరలు మారలేదు.  కేంద్ర ప్రభుత్వం గతంలో చమురు ధరపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం ద్వారా ప్రజలకు గొప్ప ఉపశమనం కలిగించింది.
 

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలో నిరంతరం తగ్గుదల కొనసాగుతోంది. దీంతో గత కొద్ది రోజులుగా వీటి ధరలో హెచ్చు తగ్గులు కొనసాగుతున్నాయి. వీటన్నింటి మధ్య దాదాపు మూడున్నర నెలలుగా పెట్రోల్‌-డీజిల్‌ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర, మేఘాలయ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ మూడున్నర నెలలుగా చమురు ధరలు మారలేదు.  కేంద్ర ప్రభుత్వం గతంలో చమురు ధరపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం ద్వారా ప్రజలకు గొప్ప ఉపశమనం కలిగించింది.

మేఘాలయలో నేడు క్రూడాయిల్ ధర 
మహారాష్ట్రలో షిండే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చమురుపై వ్యాట్ తగ్గించారు. అప్పట్లో మహారాష్ట్రలో పెట్రోల్ ధర రూ.5, డీజిల్ ధర రూ.3 తగ్గింది. ముడి చమురు పడిపోయి బ్యారెల్‌కు $90 దిగువన ట్రేడవుతోంది. సోమవారం ఉదయం WTI క్రూడ్ ధర బ్యారెల్‌కు 88.29 డాలర్లకు చేరుకుంది. మరోవైపు, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 94.60 డాలర్లకు పడిపోయింది.

అంతకుముందు మే 22న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య తర్వాత పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 తగ్గింది.  తరువాత కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్‌ని తగ్గించాయి.

మీ నగరంలో నేటి ధర (సెప్టెంబర్ 5న పెట్రోలు-డీజిల్ ధర)
- పోర్ట్ బ్లెయిర్‌లో పెట్రోల్ ధర  రూ. 84.10, డీజిల్ ధర  రూ. 79.74
- ఢిల్లీ పెట్రోల్ ధర  రూ. 96.72, డీజిల్ ధర  రూ. 89.62
- ముంబై పెట్రోల్ ధర  రూ. 111.35, డీజిల్ ధర  రూ. 97. 28
- చెన్నైలో  పెట్రోల్‌ ధర  రూ.102.63, డీజిల్‌ ధర  రూ.94.24
-కోల్‌కతాలో  పెట్రోల్‌ ధర  రూ.106.03, డీజిల్‌ ధర  రూ.92.76
- నోయిడాలో పెట్రోల్‌ ధర  రూ.96.57, డీజిల్‌ ధర  రూ.89.96
-లక్నోలో పెట్రోల్‌ ధర  రూ.96.57, డీజిల్‌ ధర రూ.89.76
- జైపూర్‌లో పెట్రోల్‌ ధర రూ.108.48, డీజిల్‌ ధర రూ.93.72
- తిరువనంతపురంలో పెట్రోల్  ధర  రూ. 107.71, డీజిల్ ధర  లీటరుకు రూ. 96.52 
-పాట్నాలో పెట్రోల్ ధర  రూ. 107.24, డీజిల్ ధర  లీటరుకు రూ. 94.04
-గురుగ్రామ్‌లో పెట్రోల్ లీటర్‌కు రూ.97.18, డీజిల్‌ ధర రూ.90.05 
- బెంగళూరులో పెట్రోల్‌ ధర రూ.101.94, డీజిల్‌ ధర రూ.87.89
-భువనేశ్వర్‌లో పెట్రోల్‌ ధర రూ.103.19, డీజిల్‌ ధర రూ.94.76 
-చండీగఢ్‌లో పెట్రోల్‌ ధర రూ.96.20, డీజిల్‌ ధర రూ.84.26 
హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.109.66, డీజిల్‌ ధర రూ.97.82

తాజా ధరలను చెక్ చేయడానికి
మీరు ఎస్‌ఎం‌ఎస్ ద్వారా పెట్రోల్, డీజిల్ ధరల గురించి సమాచారం పొందవచ్చు. చమురు కంపెనీలు SMS ద్వారా సమాచారాన్ని అందిస్తాయి. ధరలను చెక్ చేయడానికి, ఇండియన్ ఆయిల్ (IOC) కస్టమర్లు RSP<డీలర్ కోడ్> అని టైప్ చేసి 9224992249కికి HPCL కస్టమర్లు HPPRICE <డీలర్ కోడ్> అని టైప్ చేసి 9222201122కి, BPCL కస్టమర్లు RSP<డీలర్ కోడ్> 9223112222కి ఎస్‌ఎం‌ఎస్ చేయాలి.

click me!