డైనోసార్ల మాదిరిగానే త్వరలోనే మానవ జాతి అంతం అవ్వడం ఖాయం...ఎలాన్ మస్క్ సంచలన ఆర్టికల్..

Published : Sep 04, 2022, 06:40 PM IST
డైనోసార్ల మాదిరిగానే త్వరలోనే మానవ జాతి అంతం అవ్వడం ఖాయం...ఎలాన్ మస్క్ సంచలన ఆర్టికల్..

సారాంశం

తరచూ సంచలన ట్వీట్లతో వార్తల్లో నిలిచే ఎలాన్ మస్క్ తాజాగా ఓ సుదీర్ఘ  వ్యాసంతో ముందుకు వచ్చాడు. ఈ సారి మానవజాతి అంతం అయ్యేందుకు చివరి అంచున ఉందని బాంబు పేల్చాడు. దీనికి లాజికల్ రీజన్ కూడా చెప్పాడు. 

 ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలాన్ మస్క్ తరచూ వివాదాస్పద ప్రకటనలు చేస్తూ వార్తల్లో నిలవడం ఆయనకు అలవాటే. ట్విట్టర్ డీల్ తర్వాత మస్క్ మాటల మీద నెటిజన్లలో నమ్మకమే పోయింది. అయితే ఈసారి ఎలాన్ మస్క్ కొత్త సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు.

డైనోసార్ల లాగే, మానవజాతి అంతం అవుతుందనే వాదనను  ఎలాన్ మస్క్ ముందుకు తెచ్చారు. ఎందుకంటే ప్రపంచం వినాశనం అంచున ఉందని మస్క్ చెప్పారు. అయితే విచిత్రంగా ఈ సారి ఎలాన్ మస్క్ వాదనతో చాలామంది ఏకీభవిస్తున్నారు. కొంతమంది అటెన్షన్ కోసం  మస్క్ చేసిన పుకారు అని కొట్టి పారేశారు. అయితే దీనిపై మస్క్ వివరణ ఇస్తూ.. ప్రపంచం అంతరిస్తే మానవజాతి అంతరించిపోతుందని అన్నారు.

ఎలోన్ మస్క్ తన ఆలోచనను బీబీసీకి రాసిన వ్యాసం రూపంలో అందించారు. మస్క్ తన వ్యాసంలో కొన్ని శాస్త్రీయ ఆలోచనలను పేర్కొన్నాడు. డైనోసార్ల తర్వాత జురాసిక్ యుగం ముగిసిందని. ఈ జాతుల జంతువులతో పాటు, అనేక ఇతర వన్యప్రాణులు అంతరించిపోయాయి. ఇప్పుడు చిన్న పక్షులు, జంతువులు (వన్యప్రాణులు) అంతరించిపోయే దశలో ఉన్నాయి. అనేక జాతులు అంతరించిపోయాయి. మానవ జనాభా మాత్రమే పెరుగుతోంది. అలా జరిగితే మనిషి మాత్రమే ఈ భూమిపై మనుగడ సాగించలేడని. ఇది అసమతుల్యతలను సృష్టించడమే కాకుండా ప్రపంచం అంతానికి కూడా నాంది పలుకుతుందని ఎలన్ మస్క్ కొత్త వాదనను వినిపించారు.

ఈసారి మస్క్ చెప్పినది కాస్త సీరియస్‌గా ఉంది. మస్క్ చెప్పినట్లుగా, అనేక జంతువులు, పక్షులు అంతరించిపోయాయి. ప్రస్తుతం ఉన్న జంతువుల సంఖ్య తగ్గింది. అటవీ ప్రాంతం క్షీణిస్తోంది. వరదలతో, కొండచరియలు విరిగిపడుతున్నాయి. ప్రపంచంలోని చాలా తీర ప్రాంతాలు గ్లోబల్ వార్మింగ్ మూలంగా నీటిలో మునిగిపోతున్నాయి. ఇదంతా మస్క్ సూచించిన ప్రపంచ అంతానికి ముందస్తు సూచనా అనే చర్చ ఇప్పుడు మొదలైంది. 

స్టార్ లింక్ నెట్‌ను హ్యాక్ చేయడానికి రష్యా విఫల ప్రయత్నం: మస్క్
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి స్టార్‌లింక్ ఇంటర్నెట్ సిస్టమ్‌ను హ్యాక్ చేయడానికి హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారని కంపెనీ హెడ్ ఎలోన్ మస్క్ ఆరోపించారు. కానీ అలాంటి హ్యాకింగ్, జామింగ్ దాడులను విజయవంతంగా అడ్డుకున్నామని ఆయన స్పష్టం చేశారు. రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పుడు మొబైల్ టవర్లను ధ్వంసం చేసింది. దీని కారణంగా, ఉక్రెయిన్‌లో ఇంటర్నెట్ కనెక్షన్ నిలిచిపోయిందని. కానీ ఉక్రెయిన్ డిమాండ్ మేరకు ఎలోన్ మస్క్ స్టార్‌లింక్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్‌ని అందించిందని తెలిపారు. ఆ కొద్దిసేపటికే తమ స్టార్ లింక్ సిస్టంపై హ్యాకింగ్ ప్రయత్నం జరిగిందని మస్క్ ఆరోపించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Recharge Price Hike : న్యూఇయర్ లో మీ ఫోన్ మెయింటెనెన్స్ మరింత కాస్ట్లీ.. మొబైల్ రీచార్జ్ ధరలు పెంపు..?
Youtube Income: యూట్యూబ్‌లో గోల్డెన్ బటన్ వస్తే నెలకు ఎన్ని డబ్బులు వస్తాయి?