కరోనా, లాక్ డౌన్ ఎఫెక్ట్ : 22 వేల కోట్లకు డీటీహెచ్‌ ఆదాయం..

By Sandra Ashok KumarFirst Published Sep 12, 2020, 12:22 PM IST
Highlights

ప్రజలు ఇంట్లోనే ఉంటుండటం డీటీహెచ్‌ సంస్థలకు లాభించనుంది. టీవీ ప్రసారాల వీక్షణ గణనీయంగా పెరగడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డైరెక్ట్‌–టు–హోమ్‌ బ్రాడ్‌కాస్టర్ల ఆదాయం రూ. 22,000 కోట్లకు చేరనుంది.
 

ముంబయి:  కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి, లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో డైరెక్ట్-టు-హోమ్ (డిటిహెచ్) సంస్థలకు నిజంగా  ఒక వరంగా మారింది, ఎందుకంటే టీవీ ప్రసారాల వీక్షణ గణనీయంగా పెరగడంతో డిటిహెచ్ పరిశ్రమ మొత్తం 6 శాతం వరకు వృద్ధిని సాధించింది.  

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 22,000 కోట్లకు చేరుకుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ శుక్రవారం తెలిపింది. భారతదేశంలో మొత్తం టెలివిజన్ (టీవీ) చందాదారులలో 37 శాతం డైరెక్ట్-టు-హోమ్ (డిటిహెచ్) వాటా ఉంటుంది.

2020 ఆర్థిక సంవత్సరంలో 14 శాతం వృద్ధి నమోదైంది.  వీటిలో 9 శాతం సబ్‌స్క్రయిబర్స్‌  పెరుగుదల నుండి, 5 శాతం వినియోగదారుల సగటు ఆదాయంలో (ARPU) పెరిగింది అని  సీనియర్ దర్శకుడు సచిన్ గుప్తా అన్నారు.

also read 

'అయితే, న్యూ టారిఫ్ ఆర్డర్ (ఎన్‌టిఓ) బహుళ టీవీలున్న యూజర్లకు చార్జీలు తగ్గించడం తదితర అంశాల కారణంగా ఏఆర్‌పీయూ మాత్రం 1–2 శాతం మేర క్షీణించి రూ. 310–315 స్థాయికి రావచ్చని  అని ఆయన చెప్పారు.

"సామాజిక దూరం నిబంధనలు, వర్క్ ఫ్రమ్ హోమ్ (డబ్ల్యుఎఫ్హెచ్) ఈ ఆర్థిక సంవత్సరంలో చాలా వరకు ప్రజలను ఇళ్లకే పరిమితం చేసే అవకాశం ఉంది.

అంతేకాకుండా, కొత్త టీవీ సీరియల్ ఎపిసోడ్ల ప్రసారం తిరిగి ప్రారంభించడం, పండుగ సీజన్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐ‌పి‌ఎల్)వంటి క్రీడా కార్యక్రమాలు ప్రసారం చేయడం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది" అని ఏజెన్సీ తెలిపింది. రేటింగ్ ఏజెన్సీ  డి‌టి‌హెచ్  పరిశ్రమ క్రెడిట్ ప్రొఫైల్ ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా మెరుగుపడుతుందని ఆశిస్తోంది.

click me!