రూ. 2000 నోట్ల మార్పిడి విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న HFDC బ్యాంక్...కస్టమర్లకు బంపర్ ఆఫర్..

By Krishna Adithya  |  First Published May 22, 2023, 12:38 PM IST

2000 నోట్ల మార్పిడి విషయంలో HDFC బ్యాంక్ ముందు అడుగు వేసింది. ఇందులో భాగంగా తమ బ్యాంకు లోని ఏ బ్రాంచీలో అయినా ఖాతాదారులు కాకపోయినా సరే కస్టమర్లు నేరుగా వచ్చి 2000 రూపాయల నోట్లను మార్చుకోవచ్చని పేర్కొంది. 


హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్‌లు రేపటి నుంచి, సెప్టెంబర్ 30, 2023 వరకు తమ ఖాతాల్లో రూ. 2000 నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చని ప్రకటించింది. కస్టమర్‌లు రేపటి నుండి రోజువారీ పరిమితి రూ. 20,000 సమానమైన రూ. 2000 కూడా మార్చుకోవచ్చని తమ కస్టమర్లను ఆహ్వానించింది.  సెప్టెంబర్ 30, 2023 వరకు మీరు ఏ బ్రాంచ్‌లోనైనా మీ HDFC బ్యాంక్ ఖాతాలో పది రూ. 2000 నోట్లను డిపాజిట్ చేయవచ్చని తెలిపింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ రిలేషన్‌షిప్ మేనేజర్ సౌరభ్ కుమార్ మాట్లాడుతూ, ఖాతా లేని వ్యక్తి కూడా 2000 నోట్లను ఏ బ్యాంక్ బ్రాంచ్ నుండి అయినా రూ.20,000 వరకు మార్చుకోవచ్చు. ఇది కాకుండా, మీరు మీ ఖాతాలో ఎన్ని 2000 నోట్లనైనా డిపాజిట్ చేయవచ్చు. నోట్లను మార్చుకునే వెసులుబాటును అన్ని బ్యాంకుల ద్వారా ఉచితంగా కల్పిస్తామని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) క్లీన్ నోట్ పాలసీ కింద రూ.2000 నోటును ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. అయితే, ఈ నోట్లు ప్రస్తుతానికి చెలామణిలో ఉంటాయి. ఈ నోట్లను 30 సెప్టెంబర్ 2023లోపు బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని లేదా బ్యాంకులు, రిజర్వ్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చుకోవాలని ప్రజలకు RBI సూచించింది. ఆర్బీఐ ప్రకారం మే 23 నుంచి రూ.2000 నోట్లను మార్చుకుని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చు. అయితే ఒకసారి రూ.20,000 విలువైన నోట్లు మాత్రమే మారుతాయి.అంటే ఒక్కసారి గరిష్ఠంగా 10 నోట్లను మాత్రమే మార్చుకోవచ్చు.

Latest Videos

మీ వద్ద 2000 నోట్లు ఉంటే, వీలైనంత త్వరగా బ్యాంకులో డిపాజిట్ చేయండి. ఎందుకంటే ఈ 2000 నోటు ఇప్పుడు చట్టబద్ధంగా ఉంటుంది, అయితే ఇది చెలామణి నుండి మాత్రమే తొలగిస్తున్నారు. 2000 రూపాయల నోటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉపసంహరించుకోనుంది. దీని కోసం, సెప్టెంబర్ 30, 2023 వరకు, అన్ని బ్యాంకులు, RBI యొక్క 19 ప్రాంతీయ కార్యాలయాలలో నోట్లను మార్చవచ్చు. అయితే లావాదేవీల్లో మాత్రం 2000 నోట్ల వినియోగం కొనసాగుతుంది. కానీ సెప్టెంబర్ 30, 2023 నాటికి, వాటిని బ్యాంకులో డిపాజిట్ చేయాలని గుర్తుంచుకోండి. 

నోట్ల మార్పిడికి కస్టమర్‌గా ఉండాల్సిన అవసరం లేదు
నోటు మార్చుకోవాలంటే బ్యాంకు ఖాతాదారుడిగా ఉండాలా వద్దా అనే సందేహం ప్రజల్లో నెలకొంది. కాబట్టి మీరు ఏదైనా బ్యాంకు శాఖకు మరియు రిజర్వ్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లి నోట్లను మార్చుకోవచ్చని తెలిపింది. 

తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రూ. 2000 నోట్లను డిపాజిట్ చేసేవారు సైతం రిక్విజిషన్ స్లిప్ నింపాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ రంగ బ్యాంకులోని ఏ బ్రాంచ్‌లోనైనా రూ. 200 బ్యాంకు నోట్ల మార్పిడికి పాన్ లేదా ఆధార్ వంటి ఏదైనా గుర్తింపు రుజువును సమర్పించాల్సిన అవసరం లేదని SBI పేర్కొంది. 

click me!