Personal Loan: పర్సనల్ లోన్ తీసుకొని తిరిగి చెల్లించడం లేదా? స్టెప్ బై స్టెప్ ఏమవుతుందో తెలుసుకోండి

Published : Aug 12, 2025, 05:08 PM IST
Personal Loan

సారాంశం

పర్సనల్ లోన్ చాలా సులభంగా బ్యాంకులు ఇచ్చేస్తున్నాయి. కానీ వాటిని సమయానికి కట్టే వారి సంఖ్య మాత్రం తక్కువే. దీనివల్ల బ్యాంకులకు కూడా ఆర్థిక నష్టాలు వస్తున్నాయి. వ్యక్తిగత రుణాలను కట్టకుండా ఎగ్గొడితే ఏం జరుగుతుందో తెలుసుకోండి. 

వ్యక్తిగత రుణాలు తీసుకునే వారి సంఖ్య అధికంగానే ఉంది. కాకపోతే వాటిని సకాలంలో చెల్లిస్తున్న వారు కూడా తక్కువగానే ఉన్నారు. వ్యక్తిగత రుణం దరఖాస్తు ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా కూడా త్వరగా ఆమోదము లభించే అవకాశాలు ఉన్నాయి. అందుకనే పర్సనల్ లోన్ ఎక్కువమంది తీసుకుంటూ ఉంటారు. పెళ్లికి, ఇంటి మరమ్మతులకు... ఇలా అనేక రకాలుగా పర్సనల్ లోన్ వాడుతూ ఉంటారు. కాకపోతే వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ క్రెడిట్ స్కోరు మీకు వచ్చే ఆదాయాన్ని బట్టి కూడా వడ్డీ రేట్లు మారే అవకాశం ఉంటుంది. పర్సనల్ లోన్‌ను ప్రతినెలా వాయిదాల రూపంలో చెల్లించాలి. ప్రతినెలా సమయానికి చెల్లించకపోయినా లేదా ఆలస్యంగా చెల్లించినా డిఫాల్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నెలవారి వాయిదాలు మీ బడ్జెట్ కు అనుగుణంగా ఈ నెల వారీ చెల్లింపులను ఏర్పాటు చేసుకోవాలి.

కొంతమంది పర్సనల్ లోన్ తీసుకున్న తర్వాత తిరిగి చెల్లించేందుకు ఇష్టపడరు. అలాంటి వారిపై బ్యాంకులో ఎలాంటి చర్యలు తీసుకుంటాయో పెద్దగా అవగాహన ఉండదు. కేవలం ఫోన్లు మాత్రమే చేస్తారని అనుకుంటారు. నిజానికి పర్సనల్ లోన్ చెల్లించకపోతే స్టెప్ బై స్టెప్ బ్యాంకు మీపై కఠిన చర్యలు తీసుకుంటుంది.

సిబిల్ స్కోర్ పడిపోతుంది

మొదటగా ఈఎమ్ఐ చెల్లించడంలో మీరు జాప్యం చేసినా లేక చెల్లించకపోయినా ఆ విషయాన్ని లేదా ఆ సమాచారాన్ని క్రెడిట్ బ్యూరోలకు బ్యాంకులో తెలియజేస్తాయి. దీనివల్ల మీ క్రెడిట్ స్కోరు చాలా వరకు తగ్గిపోతుంది. ఒక్క నెల ఆలస్యంగా చెల్లించినా కూడా క్రెడిట్ స్కోర్ తగ్గిపోయే అవకాశం ఉంది. అదే సిబిల్ స్కోర్ తగ్గిపోతే మీకు బ్యాంకులో కొత్త లోన్ వచ్చే అవకాశం క్రెడిట్ కార్డులు వచ్చే అవకాశం కష్టంగా మారుతుంది.

ఈఎమ్ఐ గడువు దాటినా కూడా మీరు చెల్లించకపోతే మీకు బ్యాంకుల నుంచి మెసేజులు, ఈమెయిల్సు, ఫోన్ కాల్స్ రావడం మొదలవుతాయి. మొదట మీకు గుర్తు చేయడం కోసం ఫోన్ చేస్తారు. మీరు స్పందించకపోయినా కాల్స్ సంఖ్య పెరిగిపోతుంది. అలాగే మీరు రుణం తీసుకునేటప్పుడు మీ ఒక కుటుంబ సభ్యుడు లేదా స్నేహితుడి వివరాలు కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఆ తర్వాత వారికి కూడా ఫోన్లు చేయడం మొదలుపెడతారు.

ఆస్తులు జప్తు చేస్తారు

అయినా కూడా మీరు స్పందించకుండా ఈ అమ్మాయిలు చెల్లించకపోతే బ్యాంకులో భారీగా వడ్డీలు వేయడం, జరిమానా వడ్డీలు వేయడం మొదలు పెడతారు. లేట్ ఫీజులు కూడా వేస్తారు. దీని వల్ల మీ అప్పు మరింతగా పెరిగిపోతుంది. మీరు కట్టాల్సిన అసలు కంటే ఈఎంఐ అధికంగా మారుతుంది. అప్పటికి కూడా మీరు ఈ అమ్మాయిలు చెల్లించకపోతే బ్యాంకులో చట్టపరమైన పనులకు సిద్ధపడతాయి. మీకు లీగల్ నోటీసులు పంపిస్తాయి. తర్వాత మీపై కోర్టులో కేసును వేస్తాయి. కోర్టులో కేసు విచారణకు వస్తుంది. కేసు ఈ వ్యక్తిగత రుణానికి తగ్గట్టు మీ ఆస్తులను తాకట్టు పెట్టి లేదా జప్తు చేసే అవకాశం ఉంది. అది ఇల్లు, కారు, స్థలము, భూమి ఏదైనా కావచ్చు. వాటిని జప్తు చేసి బ్యాంకులకు ఆ రుణాన్ని తీర్చుకునే సౌకర్యాన్ని కోర్టులు కల్పిస్తాయి.

కాబట్టి వ్యక్తిగత రుణం, ఇంటి రుణం ఏదైనా కూడా సమయానికి కట్టే విధంగా ప్లాన్ చేసుకోండి. విలాసాల కోసం ఎప్పుడూ అప్పులు తీసుకోకండి. అలాగే మీరు వ్యక్తిగత లోన్ తీసుకునే ముందు మీ ఆదాయం ఎంత వస్తుందో,మీకు ఖర్చులు ఎంత అవుతాయో, ఒక బడ్జెట్ ప్రణాళిక ప్రకారమే తీసుకోండి. మీరు ఈఎమ్ఐ అనుకుంటేనే అప్పు తీసుకునేందుకు ముందుకు వెళ్ళండి. ఈఎంఐ కట్టాల్సిన తేదీకి తగినంత మొత్తం అకౌంట్లో డబ్బు ఉండేలా జాగ్రత్త పడండి.

ఆటో డెబిట్ ఆప్షన్ పెట్టుకోండి

అలాగే ఆటో డెబిట్ సౌకర్యం పెట్టుకుంటే మంచిది. మీరు మర్చిపోయినా కూడా ఆటోమేటిక్ గా ఈఎంఐ బ్యాంకుకు చేరుకుంటుంది. అలాగే ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు కట్టడం కష్టమవుతుంది. అందుకే ఒక ఎమెర్జెన్సీ పండుగ కూడా ఉంచుకోండి. ఆ ఎమర్జెన్సీ పండించి అత్యవసర సమయంలో ఈఎంఐ కట్టేందుకు ప్రయత్నించండి. ఒకవేళ మీకు ఈఎంఐ కట్టే పరిస్థితి ఆ నెలలో లేకపోతే ముందుగానే బ్యాంకును సంప్రదించి గడువు పొడిగించమని లేదా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయేమో సూచించమని అడగండి. రుణం నుంచి తప్పించుకుంటే మిమ్మల్ని దోషిగా పరిగణించే అవకాశం ఉంటుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మీలో ఈ మూడు విషయాలుంటే చాలు..! సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ కావచ్చు.. అంబానీ అవ్వొచ్చు
Aadhaar PAN Link : డిసెంబర్ 31 డెడ్‌లైన్.. ఆధార్, పాన్ లింక్ చేయకపోతే ఏం జరుగుతుంది?