CIBIL Score Improve: సిబిల్ స్కోర్ బాగుంటేనే బ్యాంకులు లోన్లు ఇస్తాయి, దాన్ని ఎలా పెంచుకోవాలో తెలుసుకోండి

Published : Aug 11, 2025, 05:00 PM IST
Cibil Score Improvement tips

సారాంశం

సిబిల్ స్కోర్ లోన్ కు ఎంతో ముఖ్యమైనది. క్రెడిట్ కార్డు కావాలన్నా, బ్యాంకులు నుంచి ఏ లోన్ కావాలన్నా సిబిల్ స్కోర్ ను కచ్చితంగా చూస్తారు. దీన్నే క్రెడిట్ స్కోర్ అని అంటారు. సిబిల్ స్కోర్ పెంచుకోవడం ఎలాగో తెలుసుకోండి. 

బ్యాంకు నుంచి మీకు పర్సనల్ లోన్ కావాలన్నా, కార్ లోన్ కావాలన్నా, హోమ్ లోన్ కావాలన్నా మిమ్మల్ని బ్యాంకులు ముందుగా అడిగేది మీ క్రెడిట్ స్కోరు లేదా సిబిల్ స్కోర్ ఎంత ఉంది? అని. ఆ స్కోర్ ఎక్కువగా ఉంటేనే మీకు లోన్ త్వరగా వస్తుంది. క్రెడిట్ స్కోరు లేదా సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే మీకు లోన్ రావడం కష్టమైపోతుంది. చివరికి క్రెడిట్ కార్డు కూడా మీకు ఇవ్వరు. అందుకే సిబిల్ స్కోర్ ఎంతో ముఖ్యమైనది. సిబిల్ స్కోర్ ను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సిబిల్ అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఇచ్చే స్కోరు అని చెప్పుకోవాలి. దీన్ని ఎన్నో ఆర్థిక అంశాల్ని పరిగణనలోకి తీసుకొని లెక్కిస్తారు.

సిబిల్ స్కోర్ లెక్కించేందుకు 36 నెలల క్రెడిట్ ప్రొఫైల్ ను పరిగణలోకి తీసుకుంటారు. ఆ ప్రొఫైల్లో మీరు తీసుకున్న ఇతర లోన్లు, క్రెడిట్ కార్డులు, ఓవర్ డ్రాఫ్ట్ లు ఇలా బ్యాంకులో మీరు చేసిన ప్రతి పనికి చెందిన చరిత్ర ఉంటుంది. ఇదే మీ క్రెడిట్ హిస్టరీ లేదా సిబిల్ స్కోర్ ను నిర్ణయిస్తుంది.

సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి?

సిబిల్ స్కోర్ అనేది మూడు వందల నుంచి 900 మధ్య ఉంటుంది. 750 సిబిల్ స్కోర్ దాటితే అది అత్యుత్తమమైనదే. అదే 650 నుంచి 750 మధ్య ఉంటే పరవాలేదు. కానీ 550 నుంచి 650 ఉంటే యావరేజ్ గా చెప్పుకోవాలి. అదే 550 కంటే తక్కువగా ఉంటే మాత్రం సిబిల్ స్కోర్ చాలా బలహీనంగా ఉన్నట్టు లెక్క. మీకు లోన్లు రావడం చాలా కష్టం.

సివిల్ స్కోర్ లెక్కింపులో ముఖ్యమైనవి మీ గత హిస్టరీ. అంటే మీరు దేనికైనా బిల్స్ చెల్లించడం, ఈఎమ్ఐలు కట్టడం వంటివి సమయానికి చేస్తున్నారో లేదో గమనించి దాన్నిబట్టి స్కోరు వస్తుంది. ఉదాహరణకు మీరు క్రెడిట్ కార్డును వాడితే ఆ క్రెడిట్ కార్డు బిల్లును ఎప్పటికప్పుడు కట్టేయాలి. దాన్ని ఆలస్యం చేయడం, వడ్డీలు కట్టడం, ఓవర్ డ్రాఫ్ట్ అవ్వడం వంటివి జరిగితే మీ సిబిల్ స్కోర్ తగ్గుతూ ఉంటుంది. సిబిల్ స్కోర్ అనేది బ్యాంకులో మీకు లోన్లు ఇవ్వాలా? వద్దా? అని నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి.

సిబిల్ స్కోర్ ను ఎలా పెంచుకోవాలి?

క్రెడిట్ స్కోరు లేదా సిబిల్ స్కోరు పెంచడం రెండురోజులు లేదా మూడు రోజుల్లో జరిగే విషయం కాదు. మీరు ఇప్పటికే ఏదైనా రుణం తీసుకోవడం లేదా క్రెడిట్ కార్డు వాడటం వంటివి చేస్తే ఈ నెలవారీ వాయిదాలు ఎప్పటికప్పుడు చెల్లిస్తూ ఉండాలి. ఈఎమ్ఐలు బౌన్స్ అవడం, ఆలస్యంగా చెల్లించడం వంటివి చేస్తే మీరు మీ క్రెడిట్ స్కోర్ లో పాయింట్లు కోల్పోతూ ఉంటారు. మీరు వాయిదాలు సమయానికి కట్టడానికి, ఆటో పే లేదా రిమైండర్ ను సెట్ చేసుకోండి. గడువు తేదీకి ముందే కట్టేందుకు ప్రయత్నించండి. క్రెడిట్ కార్డు వాడుతున్న వారు సకాలంలో ఆ కార్డు బిల్లులను చెల్లిస్తూ ఉండండి. ఇది మీ క్రెడిట్ కార్డ్ స్కోరును ఎప్పుడు ఉత్తమంగా ఉంచేందుకు ప్రయత్నిస్తుంది. ఎలాంటి జరిమానాలు పడకుండా జాగ్రత్త పడండి. 600 సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే భవిష్యత్తులో మీకు రుణాలు రావడం కష్టమైపోతుంది.

మీరు క్రెడిట్ కార్డు బిల్లును గడువు తేదీలోగా చెల్లించ లేకపోతే కనీసం మొత్తాన్ని అయినా చెల్లించండి. దీనివల్ల మీరు డిఫాల్టర్ అనే సమాచారం క్రెడిట్ బ్యూరోకు చేరకుండా ఉంటుంది. మీ క్రెడిట్ స్కోర్ ను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ ఉండండి. తక్కువ సమయంలోనే ఎక్కువ లోన్లు తీసుకోవడం వంటి పనులు చేయకండి. బ్యాంకులు ఎక్కువ కాలం పాటు క్రెడిట్ కార్డులు వాడుతూ, ప్రతి బిల్లును సకాలంలో చెల్లించిన కస్టమర్లను విశ్వసిస్తాయి. కాబట్టి మీ పాత క్రెడిట్ కార్డు ఖాతాను ఎప్పుడూ మూసివేయకండి. దానివల్ల మీకు త్వరగా రుణం వచ్చే అవకాశం ఉంటుంది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మీలో ఈ మూడు విషయాలుంటే చాలు..! సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ కావచ్చు.. అంబానీ అవ్వొచ్చు
Aadhaar PAN Link : డిసెంబర్ 31 డెడ్‌లైన్.. ఆధార్, పాన్ లింక్ చేయకపోతే ఏం జరుగుతుంది?