ఇకపై ఈ వస్తువులపై భారీ పన్నులు, వీటి ధరలు విపరీతంగా పెరిగిపోతాయి

Published : Aug 25, 2025, 04:37 PM IST
GST

సారాంశం

కేంద్ర ప్రభుత్వం కొన్ని వస్తువులపై 40 శాతం కంటే ఎక్కువ జీఎస్టీ విధించడానికి సిద్ధమైంది. కొన్ని ఉత్పత్తులు విపరీతంగా ధర పెరిగే అవకాశం ఉంది. అందులో ముఖ్యమైనవి మద్యం, సిగరెట్లు. 

మద్యం ప్రియులు, సిగరెట్ రాయుళ్లకు ఇది బాధపెట్టే వార్త. ఎందుకంటే ఇకపై మద్యం, సిగరెట్ల ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. దాదాపు వాటిపై 40 శాతం కంటే ఎక్కువ జీఎస్టీ విధించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. నివేదికలు చెబుతున్న ప్రకారం ఈ వస్తువులపై పన్ను పెంచడం వల్ల ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఈ వస్తువుల వినియోగాన్ని నియంత్రించడానికి కూడా ఇది సహాయపడుతుందన్నది కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం. పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలా, మద్యం వంటివి రేట్లు పెరిగితే ప్రభుత్వానికి విపరీతమైన ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవే కాదు కొత్త జిఎస్టి అమల్లోకి వచ్చే తర్వాత ఖరీదైన కార్లు, విలాసవంతమైన ఇల్లు కూడా విపరీతంగా రేట్లు పెరుగుతాయి.

వీటి ధరలే ఎందుకు పెంచాలి?

బిజినెస్ లైన్ చెబుతున్న ప్రకారం మంత్రుల బృందంతో కూడిన ప్రభుత్వం కొన్ని వస్తువులపై 40 శాతం ప్రత్యేక స్లాబ్ ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. జిఎస్టి కౌన్సిల్ లో ఈ ప్రతిపాదన పై చర్చలు కూడా జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా కూడా మద్యం సిగరెట్లపై అధిక ధరలు వేయడం చాలా ముఖ్యం. దీనివల్ల ప్రజల వాటి వాడకాన్ని కూడా తగ్గిస్తారు. విలాసవంతమైన వస్తువులు ఆరోగ్యానికి హాని చేసే వస్తువులను నియంత్రించాలన్నదే కేంద్ర ప్రభుత్వం ముఖ్య ఆలోచన.

సెప్టెంబర్ మొదటి వారంలో తేలిపోతుంది

సెప్టెంబర్ మూడు, నాలుగు తేదీలలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగునుంది. సమావేశంలో జిఎస్టి స్లాబులను నాలుగు నుంచి రెండింటికి తగ్గించే ప్రతిపాదనపై నిర్ణయం తీసుకుంటారు. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహిస్తారు. జీఎస్టీ పన్ను రేట్లతో పాటు సెస్‌లు జీవిత, ఆరోగ్య బీమాలు గురించి కూడా చర్చలు జరుగుతాయి. జీఎస్టీ పన్ను స్లాబులను మార్చాలన్న కేంద్రం ప్రతిపాదనపై గతవారం మంత్రులు బృందం కూడా అంగీకరించిందని తెలుస్తోంది.

పండుగలకు ముందే జీఎస్టీ

దసరా, దీపావళికి ముందే జీఎస్టీ కొత్త పనులు అమలులోకి వస్తే పేద మధ్యతరగతి వారికి ఎన్నో లాభాలు కలుగుతాయి. ఆ రెండు పండగలను ఎంతో ఆనందంగా చేసుకోవచ్చు. ఎందుకంటే నిత్యావసర సరుకులపై కూడా పనులు చాలా వరకు తగ్గిపోయి. వాటి ధరలు తగ్గుతాయి. అందుకే పండుగ సీజన్ కి ముందే కొత్త రేట్లు అమల్లోకి తేవాలని కూడా కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. సెప్టెంబర్ మొదటి వారంలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Credit Card: లైఫ్ టైమ్ నో ఫీ, క్యాష్‌బ్యాక్‌లు.. ఇన్ని ఇచ్చినా క్రెడిట్ కార్డుల‌తో బ్యాంకులు ఏంటీ లాభం.?
Post Office: నెల‌కు రూ. 12500 పొదుపు చేస్తే.. రూ. 40 ల‌క్ష‌లు మీ సొంతం