
పొదుపు పథకాల్లో ఫిక్స్‌డ్ డిపాజట్ కూడా ఒకటి. ఎంతోమంది ఫిక్స్‌డ్ డిపాజిట్లను చేసేందుకు ఇష్టపడుతున్నారు. మన దగ్గర ఎస్‌బీఐ, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ ఇలా ఎన్నో బ్యాంకులు ఉన్నాయి. ఏ బ్యాంకుల్లో ఎఫ్‌డి పై ఎక్కువ వడ్డీ వస్తుందో తెలుసుకుంటే... ఆ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం వల్ల ఎక్కువ లాభాలు ఉంటాయి. నిజానికి ఫిక్స్డ్ డిపాజిట్ తక్కువ రిస్క్ ఉన్న పొదుపు పథకం ఇది. డబ్బు భద్రతకు ఎంతో హామీ ఇస్తుంది. చాలా బ్యాంకులు ఏడాదికి ఎఫ్‌డి పై కొంత వడ్డీని ప్రకటిస్తాయి. ఆ వడ్డీని బట్టి ఎఫ్‌డి చేస్తూ ఉంటారు. అయితే దాదాపు బ్యాంకులన్నీ కూడా ఎఫ్‌డిపై ఒకేలాంటి వడ్డీని అందిస్తున్నాయి. ఈ విషయంలో పెద్దగా తేడా కనిపించకపోవచ్చు.. కానీ ఇప్పుడు జరిగిన కొన్ని మార్పుల తర్వాత వడ్డీ రేట్లును పరిశీలిస్తే చిన్న చిన్న తేడాలు కనిపించే అవకాశం ఉంది. ఆ చిన్న తేడాల వల్ల లాభం కూడా పెద్దగా కలగువచ్చు.
ముఖ్యంగా సీనియర్ సిటిజెన్లకు బ్యాంకులు అధిక వడ్డీని ఇస్తున్నాయి. ఆ వడ్డీ చిన్నదే కావచ్చు. కానీ దీర్ఘకాలంలో అవి ఎక్కువ మొత్తాన్ని పొదుపు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే వారికి, సీనియర్ సిటిజెన్లకు ఈ చిన్న తేడానే ఎక్కువ డబ్బును వచ్చేలా చేస్తాయి. ఎఫ్‌డి చేస్తున్నప్పుడు కచ్చితంగా బ్యాంకు వడ్డీ రేటులను గమనించండి. దీర్ఘకాలంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం వల్ల ఎంత డబ్బు వస్తుందో రెండు మూడు బ్యాంకులను తిరిగి తెలుసుకోండి.
బ్యాంకుల వెబ్సైట్లో ఎఫ్డీకి ఇచ్చే వడ్డీ గురించి కూడా సమాచారం ఉంటుంది. బ్యాంకుల వెబ్సైట్ల ప్రకారం అనేక పెద్ద బ్యాంకులో ఎఫ్డి పై ఏడాదికి మంచి స్థాయిలోనే వడ్డీని అందిస్తున్నాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు సాధారణ కస్టమర్లకు 6.25 శాతం నుండి వడ్డీని అందిస్తున్నాయి. ఇక సీనియర్ సిటిజెన్లకు 6.75 శాతం వడ్డీని ఎఫ్‌డిపై అందిస్తోంది. ఐసిఐసిఐ బ్యాంకు, కోటక్ మహేంద్ర బ్యాంకు కూడా ఇదే వడ్డీరేట్లు కొనసాగిస్తున్నాయి.
ఇక ఫెడరల్ బ్యాంకు కొంచెం ఎక్కువ వడ్డీని అందిస్తోంది అని చెప్పుకోవాలి. ఈ బ్యాంకు సాధారణ కస్టమర్లకు 6.40 శాతం వడ్డీని అందిస్తుంటే.. సీనియర్ సిటిజెన్లకు 6.90 శాతం వడ్డీని అందిస్తోంది. ఇక మన దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది ఈ ఏడాది జూలై 15 నుండి సాధారణ కస్టమర్లకు 6.25 శాతం వడ్డీని అందిస్తుంటే, సీనియర్ సిటిజెన్లకు 6.75 శాతం వడ్డీని అందిస్తోంది. ఇక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఫెడరల్ బ్యాంకులాగే అదే వడ్డీలను అందిస్తోంది. సీనియర్ సిటిజెన్లకు ఎఫ్‌డి అనేది సురక్షితమైన ప్రయోజనకరమైన పొదుపు పద్ధతి అని చెప్పుకోవచ్చు.రిస్కు తక్కువగా ఉండే పొదుపు పథకాల కోసం వెతుకుతున్న వారికి ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉత్తమ ఎంపికని చెప్పుకోవాలి.