హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు లాభాల్లో 20 శాతం వృద్ధి

By Sandra Ashok KumarFirst Published Jul 20, 2020, 11:02 AM IST
Highlights

జూన్ 30, 2020 తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం 6,658.6 కోట్లు ఆర్జించింది, ఏడాది క్రితం రూ .5,568.16 కోట్లని తెలిపింది. 2020 జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో దాని నికర ఆదాయం (నికర వడ్డీ ఆదాయం, ఇతర ఆదాయం) 8.08 శాతం పెరిగి 19,740.7 కోట్ల రూపాయలకు చేరుకుంది.

ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డిఎఫ్‌సి ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికం నికర లాభంలో 19.6 శాతం వృద్ధిని సాధించింది. జూన్ 30, 2020 తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం 6,658.6 కోట్లు ఆర్జించింది, ఏడాది క్రితం రూ .5,568.16 కోట్లని తెలిపింది.

2020 జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో దాని నికర ఆదాయం (నికర వడ్డీ ఆదాయం, ఇతర ఆదాయం) 8.08 శాతం పెరిగి 19,740.7 కోట్ల రూపాయలకు చేరుకుంది. 2019 జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో 18,264.5 ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 17.8 శాతం పెరిగి 15,665.4 కోట్ల రూపాయలకు చేరుకుంది.

అంతకు ముందు ఏడాది ఇది 13,294.3 కోట్ల రూపాయలు. 20.9 శాతం అడ్వాన్స్‌ల వృద్ధి, 24.6 శాతం డిపాజిట్ల పెరుగుదల దీనికి కారణమయ్యాయి. ఈ త్రైమాసికంలో నికర వడ్డీ మార్జిన్ 4.3 శాతంగా ఉంది. ఇతర ఆదాయంలలో 8 శాతం తగ్గి రూ .4,075.31 కోట్లకు చేరుకుంది.

also read 

రుణ నాణ్యత మెరుగుపడింది. స్థూల మొండి బకాయిలు 1.40 శాతం నుంచి 1.36 శాతానికి, నికర మొండి బకాయిలు 0.43 శాతం నుంచి 0.33 శాతానికి తగ్గాయి. కేటాయింపులు రూ.2,614 కోట్ల నుంచి రూ.3,892 కోట్లకు పెరిగాయి.

కాగా ఫలితాలపై సానుకూల అంచనాలతో శుక్రవారం ఈ షేర్‌ ధర బీఎస్‌ఈలో 3% లాభంతో రూ.1,099 వద్ద ముగిసింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఎమ్‌డీ, సీఈఓ ఆదిత్య పురి త్వరలో రిటైర్‌కాబోతున్నారు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లోనే  25 ఏళ్లుగా పనిచేస్తున్న వ్యక్తే తన  వారసుడయ్యే అవకాశాలున్నాయని ఆదిత్య పురి పేర్కొన్నారు. ఆ వ్యక్తి పేరును మాత్రం ఆయన వెల్లడించలేదు. శశిధర్‌ జగదీశన్, కైజాద్‌ బరూచాలు బ్యాంక్‌ సీఈఓ రేసులో ఉన్నారని సమాచారం.
 

click me!