ఇన్ఫోసిస్‌ భారీ డీల్... 11 వేల కాంట్రాక్ట్ చేతికి..

By Sandra Ashok KumarFirst Published Jul 20, 2020, 10:40 AM IST
Highlights

ఈ ఒప్పందంలో భాగంగా సుమారు 1,300 మంది ఉద్యోగులు వాన్‌గార్డ్ కి పనిచేయనున్నారు. ప్రస్తుతం ఫుల్ సర్వీస్ రికార్డ్ కీపింగ్ క్లయింట్ అడ్మినిస్ట్రేషన్, ఆపరేషన్స్,  టెక్నాలజీ ఫంక్షన్లకు సహకారం అందించనుంది. 

ఇండియన్ ఐటి కంపెనీ ఇన్ఫోసిస్ మంగళవారం ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ వాన్‌గార్డ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుందని, తద్వారా ఇది యుఎస్ సంస్థ  కార్యకలాపాలను నిర్వహిస్తుందని తెలిపింది. డీల్‌ విలువ 1.5 బిలియన్‌ డాలర్లు(సుమారు రూ. 11,500 కోట్లు)గా సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

పదేళ్ల కాలంవరకూ సర్వీసులను పొడిగించే వీలున్నట్లు తెలియజేశాయి. తద్వారా 2 బిలియన్‌ డాలర్లకు కాంట్రాక్ట్‌ విలువ చేరనున్నట్లు వెల్లడించాయి. ఇన్ఫోసిస్‌ ఇటీవలే క్యూ1(ఏప్రిల్‌-జూన్‌) ఫలితాలను విడుదల చేసింది. క్యూ1లో 1.7 బిలియన్‌ డాలర్ల డీల్స్‌ను కుదుర్చుకున్నట్లు తెలియజేసింది.

ఈ భాగస్వామ్యం ద్వారా, సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫారమ్‌లు మేనేజ్ మెంట్, అనుబంధ ప్రక్రియలతో సహా వాన్‌గార్డ్ డి‌సి(రిటైర్మెంట్ ప్లాన్ ) రికార్డ్ కీపింగ్ వ్యాపారానికి సహాయపడే రోజువారీ కార్యకలాపాలను ఇన్ఫోసిస్ నిర్వహించనుంది అని ఒక ప్రకటనలో తెలిపింది.

also read హ్యాండ్ శానిటైజర్లపై 18% జీఎస్‌టీ ఎందుకంటే..? ...

ఈ ఒప్పందంలో భాగంగా సుమారు 1,300 మంది ఉద్యోగులు వాన్‌గార్డ్ కి పనిచేయనున్నారు. ప్రస్తుతం ఫుల్ సర్వీస్ రికార్డ్ కీపింగ్ క్లయింట్ అడ్మినిస్ట్రేషన్, ఆపరేషన్స్,  టెక్నాలజీ ఫంక్షన్లకు సహకారం అందించనుంది.

ప్రస్తుతం ఈ విధులను నిర్వహిస్తున్న వాన్గార్డ్ సిబ్బంది అందరికీ పెన్సిల్వేనియాలోని మాల్వెర్న్, నార్త్ కరోలినాలోని షార్లెట్, అరిజోనాలోని స్కాట్స్ డేల్‌లోని వాన్‌గార్డ్ కార్యాలయాలకు సమీపంలో ఉన్న ఇన్ఫోసిస్ లో ప్లేస్మెంట్ ఇవ్వబడతాయి. "బదిలీ అవుతున్న ఉద్యోగులకు అదే జీతం, 12 నెలల కాలానికి కావల్సిన ప్రయోజనాలు, ప్రోత్సాహక అవకాశాలు లభిస్తాయి.

ఇన్ఫోసిస్ వారిని ఈ  వ్యాపారానికి అంకితం చేస్తుంది. లాంగ్ టర్మ్ గ్రోత్, అభివృద్ధికి అవకాశాలను అందిస్తుంది" అని ప్రకటన ద్వారా తెలిపింది. ప్లాన్ స్పాన్సర్‌లు (సాధారణంగా ఒక సంస్థ లేదా యజమాని) వాన్‌గార్డ్  సంబంధ నిర్వహణ బృందాలు, వ్యూహాత్మక ప్రణాళిక రూపకల్పన అండ్ కమ్యూనికేషన్ నిపుణుల సేవలను కొనసాగిస్తారని  తెలిపింది.  

click me!