జీఎస్టీ రేట్లలో కీలక మార్పులు.. తగ్గనున్న వాటి ధరలు..

Ashok Kumar   | Asianet News
Published : Aug 24, 2020, 04:40 PM ISTUpdated : Aug 24, 2020, 05:52 PM IST
జీఎస్టీ రేట్లలో కీలక మార్పులు.. తగ్గనున్న వాటి ధరలు..

సారాంశం

జీఎస్టీ రేట్లలో పలు కీలక మార్పులు చేస్తూ కేంద్ర ఆర్ధిక శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది.  28 శాతం శ్లాబులో ఉన్న సుమారు 230 వస్తువులు, సేవలలో 200 వస్తువులను తక్కువ శ్లాబ్‌కు మార్చింది. 

కేంద్రం ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)  పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమనం కలిగించింది.  జీఎస్టీ రేట్లలో పలు కీలక మార్పులు చేస్తూ కేంద్ర ఆర్ధిక శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది.  

28 శాతం శ్లాబులో ఉన్న సుమారు 230 వస్తువులు, సేవలలో 200 వస్తువులను తక్కువ శ్లాబ్‌కు మార్చింది. జిఎస్‌టి 29.3 శాతం ఉన్న హెయిర్ ఆయిల్, టూత్‌పేస్ట్, సబ్బులు వంటి రోజు వాడే నిత్యవసర ఉత్పత్తుల పన్ను రేటును 18 శాతానికి తగ్గించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 

also read పేటీఎం కస్టమర్లకు గుడ్ న్యూస్.. వారికి ఎంతో ప్రయోజనం.. ...

అంతకుముందు 230 ఉత్పత్తులు అత్యధికంగా 28 శాతం పన్ను స్లాబ్‌లో ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిలో 200 ఉత్పత్తులను తక్కువ స్లాబ్‌లకు మార్చింది. గృహనిర్మాణ రంగం ఐదు శాతం పన్ను స్లాబ్ పరిధిలోకి వస్తుంది. చౌక గృహాలపై జీఎస్టీ రేటును ఒక శాతానికి తగ్గించింది.

 ప్రజలు పన్ను చెల్లించాల్సిన రేటును తగ్గించిందని, సమ్మతిని పెంచడానికి సహాయపడిందని, పన్ను చెల్లింపుదారుల సంఖ్యను 1.24 కోట్లకు రెట్టింపు చేసిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. సినిమా టిక్కెట్లకు గతంలో 35 శాతం నుంచి 110 శాతానికి పన్ను విధించారు, కాని జిఎస్‌టి పాలనలో ఇది 12 శాతం, 18 పన్ను పరిధిలోకి తెచ్చింది.

రోజు వాడే నిత్యవసర వస్తువులు 0-5 శాతం స్లాబ్‌లలో ఉన్నాయి.  రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్, వాక్యూమ్ క్లీనర్, వుడ్ బ్రెయినర్, మిక్సర్, జ్యూస్ డిస్పెన్సర్, షేవర్, హెయిర్ క్లిప్పర్, వాటర్ హీటర్, హెయిర్ డ్రైయర్, ఎలక్ట్రిక్ స్మూతీంగ్ ఐరన్, 32 అంగుళాల టెలివిజన్ వరకు అంతకుముందు పన్ను రేటు 31.3 శాతం ఉండేది, ఇప్పుడు ఈ ఉత్పత్తులు 18 శాతం జీఎస్టీ పన్ను కింద ఉన్నాయి.  కేంద్రం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో చాలావరకు వస్తువులు ధరలు తగ్గనున్నాయి.

PREV
click me!

Recommended Stories

Insurance Scheme: రోజుకు 2 రూపాయ‌ల‌తో రూ. 2 ల‌క్ష‌లు పొందొచ్చు.. వెంట‌నే అప్లై చేసుకోండి
మీలో ఈ మూడు విషయాలుంటే చాలు..! సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ కావచ్చు.. అంబానీ అవ్వొచ్చు