స్టార్టప్‌లపై కేంద్రం చిన్నచూపు... గతం కంటే తగ్గింపు నిధులు

By Arun Kumar PFirst Published Feb 4, 2019, 4:36 PM IST
Highlights


కేంద్రం యావత్ దేశాన్ని డిజిటలీకరిస్తామని పదేపదే చెబుతోంది. కానీ ఆచరణలో పరిస్థితి భిన్నంగా ఉంది. బడ్జెట్ లో స్టార్టప్ ల అభివృద్ధి కోసం కేవలం రూ.25 కోట్లు కేటాయించింది. ఇది 2018-19 సంవత్సరంలో కంటే మూడు కోట్లు తక్కువ. అంటే ప్రభుత్వ లక్ష్యాలు ఆచరణ యోగ్యమా? అంటే అనుమానమే మరి.

న్యూఢిల్లీ: వచ్చే ఐదేళ్లలో లక్ష గ్రామాలను డిజిటల్ గ్రామాలుగా తీర్చిదిద్దాలని కేంద్రం సంకల్పించింది. అందుకు బాటలు వేసే స్టార్టప్‌లపై మాత్రం కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదని అర్థం అవుతున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి నరేంద్ర మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో స్టార్టప్‌ల కోసం రూ.25 కోట్ల నిధులను మాత్రమే కేటాయించింది. 

2018-19 కంటే స్టార్టప్‌లకు నిధులు తక్కువ
స్టార్టప్‌ల కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన రూ.28 కోట్ల కంటే ఇది తక్కువ. అత్యంత వేగవంతంగా భారతదేశాన్ని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో కేంద్రం స్టార్టప్ ఇండియా పేరుతో ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. మరోవైపు మేక్ ఇన్ ఇండియా పథకాలకు మాత్రం రూ.232.02 కోట్లు, జాతీయ తయారీ దారుల పథకాలకు రూ.8.47 కోట్లు, ఫండ్ ఆఫ్ ఫండ్స్‌కు రూ.100 కోట్లను కేటాయించింది. 

మేకిన్ ఇండియాకు రూ.573.3 కోట్లు
మొత్తంమీద వచ్చే ఏడాది మేక్ ఇన్ ఇండియా కోసం రూ. 473.3 కోట్ల నిధులను అందించనున్నది. 2018-19లో కేటాయించిన రూ.149 కోట్లతో పోలిస్తే రెండు రెట్లు అధికం. భారత్‌ను అంతర్జాతీయ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో 2014 సెప్టెబర్ 24న మేక్ ఇన్ ఇండియా పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. అలాగే డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రీయల్ పాలసీ అండ్ ప్రమోషన్ నిధుల కేటాయింపులు రూ.5,674.51 కోట్లకు తగ్గించింది.

click me!