పెట్రోల్ డీజిల్ కొత్త ధరలు: నేడు లీటరు ధర పెరిగిందా తగ్గిందా తెలుసుకోండి..

By asianet news teluguFirst Published Sep 20, 2022, 8:31 AM IST
Highlights

 క్రూడ్ ఆయిల్ ధర భారీగా తగ్గినప్పటికీ ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మే నెలలో ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన తర్వాత దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు  ఇతర నగరాల్లో ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి.

న్యూఢిల్లీ: ప్రభుత్వ చమురు కంపెనీలు  మంగళవారం ఉదయం పెట్రోల్, డీజిల్ కొత్త ధరలను విడుదల చేశాయి. తాజాగా విడుదల చేసిన ధరల ప్రకారం ఢిల్లీ, ముంబై సహా  ప్రముఖ నగరాల్లో నేటికీ ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.72, డీజిల్ రూ.89.62గా ఉంది.  ముడి చమురు గురించి మాట్లాడినట్లయితే ధరలు గత 24 గంటల్లో స్వల్పంగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర గత 24 గంటల్లో బ్యారెల్‌కు 92.10 డాలర్లకు పడిపోయింది, డబ్ల్యుటిఐ రేటు కూడా బ్యారెల్‌కు 86.01 డాలర్లకు తగ్గింది.

క్రూడ్ ఆయిల్ ధర భారీగా తగ్గినప్పటికీ ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మే నెలలో ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన తర్వాత దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు  ఇతర నగరాల్లో ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి.  చాలా ప్రాంతాల్లో ఇంధన ధరలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు మారుతుంటాయి.  

కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర రూ.92.76గా ఉంది. 

 ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.

 ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.35, డీజిల్ ధర రూ.97.28గా ఉంది.

 చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94గా ఉంది. 24 రూపాయలు

 నోయిడాలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.79, డీజిల్ ధర రూ.89.96గా ఉంది. 

బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.101.94, డీజిల్ ధర రూ.87.89గా ఉంది.

 చండీగఢ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.96.20, డీజిల్ ధర రూ.84.26గా ఉంది.

లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.76గా ఉంది.

 జైపూర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.104.48, డీజిల్ ధర రూ.93.72గా ఉంది.

 పాట్నాలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.24, డీజిల్ ధర రూ.94.04గా ఉంది.

-హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.109.66, డీజిల్‌ ధర రూ.97.82

ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు
ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్ - డీజిల్ ధరలలో సవరణ ఉంటుంది. కొత్త ధరలు ఉదయం 6 గంటల నుంచి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్  ఇతర  జోడించిన తర్వాత దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇంత ఎక్కువగా కనిపించడానికి ఇదే కారణం. పెట్రోలు, డీజిల్ ధర స్థానిక పన్నులు, వాల్యు ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు మొదలైన అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.

బి‌పి‌సి‌ఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వంటి ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలు, విదేశీ మారకపు ధరలకు అనుగుణంగా ఇంధన ధరలను ప్రతిరోజూ సవరిస్తాయి. 

ఈ విధంగా పెట్రోల్ -డీజిల్ ధరలను తెలుసుకోవచ్చు
ఇండియన్ ఆయిల్ కస్టమర్లు RSP అండ్ వారి సిటీ కోడ్‌ని 9224992249 నంబర్‌కు, BPCL కస్టమర్‌లు RSP ఇంకా వారి సిటీ కోడ్‌ను 9223112222 నంబర్‌కు, HPCL కస్టమర్‌లు HPPrice సిటీ కోడ్‌ని టైప్ చేసి 9222201122 నంబర్‌కు ఎస్‌ఎం‌ఎస్ పంపడం ద్వారా ధరను తెలుసుకోవచ్చు.
 

click me!