క్రోమా ఎర్లీ బర్డ్ సేల్ కింద, వినియోగదారులు Redmi K50i 5Gని చాలా చౌకగా కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో ఈ ఫోన్‌పై రూ.4,000 డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.
క్రోమా ఎర్లీ బర్డ్ సేల్ కింద, వినియోగదారులు Redmi K50i 5Gని చాలా చౌకగా కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో ఈ ఫోన్‌పై రూ.4,000 డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.
undefined
పండుగ సీజన్ సందర్భంగా, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తమ విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ-కామర్స్ కంపెనీ విక్రయానికి ముందు, క్రోమా ఎర్లీ బర్డ్ సేల్‌ను కూడా ప్రకటించింది. ఈ సేల్ కింద, వినియోగదారులు Redmi K50i 5Gని చాలా చౌకగా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ యొక్క 6 GB, 128 GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 25,999, అయితే క్రోమా సేల్‌లో దీనిపై రూ. 4,000 తగ్గింపును అందిస్తోంది. ఇది బ్యాంక్ ఆఫర్ ద్వారా సాధ్యం అవుతుంది. తగ్గింపు తర్వాత, ఈ ఫోన్‌ను రూ. 21,999 ధరకు కొనుగోలు చేయవచ్చు.
కస్టమర్‌లు దానిపై 10% (రూ.2,000 వరకు) తగ్గింపు. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ.3,000 క్యాష్‌బ్యాక్, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ.1,000 తగ్గింపును పొందుతారు.
Redmi K50i 5G 6.6-అంగుళాల IPS LCD FH+ డిస్ ప్లే లభ్యం అవుతోంది, ఇది 1080 x 2460 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంది. విశేషమేమిటంటే దీని డిస్‌ప్లే 144Hz రిఫ్రెష్ రేట్, 270Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek డైమెన్సిటీ 8100 చిప్‌సెట్‌తో వస్తుంది, ఇది గరిష్టంగా 8GB RAM, 256GB స్టోరేజీతో వస్తుంది. Redmi K50i డ్యూయల్ స్పీకర్లు Dolby Atmos సపోర్ట్ తో వస్తాయి. ఫోన్‌లో 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉంది.
కెమెరా విషయానికి వస్తే Xiaomi కొత్త Redmi K50i 5Gలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుంది, ఇందులో 64-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్, 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉన్నాయి. ఫోన్ ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ కెమెరా ఉంది.
Redmi K50i లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ 2.0తో పాటు థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం 7-లేయర్ గ్రాఫైట్ ప్రొటెక్షన్ ను కలిగి ఉంది. పవర్ కోసం, ఈ ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. ఇది 5080mAh బ్యాటరీ అందుబాటులో ఉంది.