వాహనదారులకు గుడ్ న్యూస్...పెట్రోల్, సీఎన్‌జీ ఇంటి వద్దకే : పెట్రోలియం మంత్రి

By Sandra Ashok KumarFirst Published May 30, 2020, 2:16 PM IST
Highlights

డీజిల్ మాదిరిగానే పెట్రోల్, ఎల్‌ఎన్‌జి కూడా డోర్ డెలివరీ చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్టు మంత్రి అన్నారు. సీఎన్‌జీ, ఎల్‌ఎన్‌జి, పీఎన్‌జిలతో సహా అన్ని రకాల ఇంధనాలను ఒకే చోట అందించడానికి త్వరలో ఒక నూతన ఇంధన రిటైల్‌ నమూనాను తీసుకొచ్చే ప్రణాళికలో ఉన్నట్టు ఆయన చెప్పారు.  
 

చమురు కంపెనీలకు పెట్రోల్, సిఎన్‌జిలను ఇంటి వద్దకే డోర్ డెలివరీ చేయనుంది. ఇందుకోసం కేంద్రం కూడా త్వరలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్ డౌన్ సమయంలో వాహన యజమానులకు సహాయం చేయడానికి చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం త్వరలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నాట్లు సూచించారు.

డీజిల్ మాదిరిగానే పెట్రోల్, ఎల్‌ఎన్‌జి కూడా డోర్ డెలివరీ చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్టు మంత్రి అన్నారు. సీఎన్‌జీ, ఎల్‌ఎన్‌జి, పీఎన్‌జిలతో సహా అన్ని రకాల ఇంధనాలను ఒకే చోట అందించడానికి త్వరలో ఒక నూతన ఇంధన రిటైల్‌ నమూనాను తీసుకొచ్చే ప్రణాళికలో ఉన్నట్టు ఆయన చెప్పారు.  

భారతదేశంలోని అతిపెద్ద ఇంధన రిటైలర్ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 2018 లో భారతదేశంలోని ఎంపిక చేసిన కొన్ని నగరాల్లో మొబైల్ డిస్పెన్సర్‌ల ద్వారా డీజిల్‌ను ఇంటికి పంపిణీ చేయడం ప్రారంభించింది. కాని లాక్ డౌన్ కారణంగా ఇంధన డిమాండ్ భారీగా పడిపోయింది. భారతదేశంలో ఇంధన వినియోగం ఏప్రిల్‌లో దాదాపు 70% తగ్గింది. పెట్రోల్ డిమాండ్ గత సంవత్సరం ఇదే సమయంలో 47% కన్నా తక్కువగా ఉంది.

also read కరోనా కష్ట కాలం అయినా.. ఆ కంపెనీలు ఉద్యోగుల జీతాలను పెంచాయి..

ఇటీవల రతన్ టాటా నేతృత్వంలోని టాటా గ్రూప్ మద్దతుతో ఇండియన్ స్టార్టప్ కంపెనీ రెపోస్ ఎనర్జీ ఇంటి వద్దకే  ఇంధనం అందించడానికి మొబైల్ పెట్రోల్ పంపులతో ముందుకు రావాలని యోచిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇలాంటి మొబైల్ పెట్రోల్ పంపులను 3,200 ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పూణేకు చెందిన సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.సిఎన్‌జి, ఎల్‌ఎన్‌జి, పిఎన్‌జిలతో సహా అన్ని రకాల ఇంధనాలను ఒకే చోట అందించడానికి త్వరలో ఇంధన కేంద్రాలను పునరుద్ధరించనున్నట్లు చమురు మంత్రి సూచించారు. 


దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో  (గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్) 56 కొత్త సీఎన్‌జీ స్టేషన్ల ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. దీని వల్ల రోజూకు 50,000 వాహనాలలో ఇంధనం  నింపడానికి సహాయపడుతుంది.
 

click me!