crypto bill:క్రిప్టోకరెన్సీలపై టి‌డి‌ఎస్ ద్వారా ప్రభుత్వనికి భారీ ఉపశమనం.. ఏటా వెయ్యి కోట్ల ఆదాయం

Ashok Kumar   | Asianet News
Published : Feb 05, 2022, 05:30 AM IST
crypto bill:క్రిప్టోకరెన్సీలపై టి‌డి‌ఎస్ ద్వారా ప్రభుత్వనికి భారీ ఉపశమనం.. ఏటా వెయ్యి  కోట్ల ఆదాయం

సారాంశం

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ 2022లో క్రిప్టోకరెన్సీల లాభాలపై 30 శాతం పన్నుతో పాటు లావాదేవీలపై ఒక శాతం  టి‌డి‌ఎస్ ని ప్రకటించారు.  అయితే ఈ కొత్త నిబంధన 1 ఏప్రిల్ 2022 నుండి అమలులోకి రానుంది.

సంక్షోభంలో ఉన్న అవకాశాలను కనుగొని దానిని బంగారంగా మార్చడానికి ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌ 2022లో గొప్ప పని చేసింది. క్రిప్టోకరెన్సీ లావాదేవీలపై ఒక శాతం టీడీఎస్ విధించాలన్న నిర్ణయం వల్ల ప్రభుత్వానికి ప్రతి ఏటా రూ.1,000 కోట్ల ఆదాయం సమకూరనుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య ఆర్థిక లోటుతో పోరాడుతున్న ప్రభుత్వానికి దీని వల్ల చాలా ఉపశమనం లభిస్తుంది.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) చైర్మన్ జే‌బి మోహపాత్ర మాట్లాడుతూ, ఈ వర్చువల్ అసెస్ట్స్ కొనుగోలు, అమ్మకాలపై ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఒక శాతం టి‌డి‌ఎస్ కోత ద్వారా భారీగా ఆర్జిస్తుంది. క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీల వార్షిక టర్నోవర్ రూ.30,000 కోట్ల నుంచి రూ.లక్ష కోట్ల వరకు ఉంటుందని ఆయన చెప్పారు. రూ.లక్ష కోట్ల ప్రాతిపదికన ఒక శాతం టీడీఎస్‌ను విధిస్తే ఏటా రూ.1,000 కోట్లు ప్రభుత్వానికి వచ్చి చేరతాయి.

 క్రిప్టోకరెన్సీల లాభాలపై 30 శాతం పన్ను ద్వారా ప్రభుత్వం ఎంత సంపాదిస్తుంది అనే దానిపై మోహపాత్రా వ్యాఖ్యానించలేదు . అయితే 30 శాతం పన్నుతో పాటు టీడీఎస్ కూడా విధిస్తే ప్రభుత్వ ఖజానాకు భారీగా డబ్బు చేరుతుందని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం దేశంలో క్రిప్టోకరెన్సీలలో రూ. 1.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఉండనట్లు అంచనా.

ఆర్థిక లోటు (fiscal deficit)
ఆదాయపు పన్ను రిటర్న్స్‌లో క్రిప్టోకరెన్సీల నుండి వచ్చే లాభాల కోసం ప్రత్యేక కాలమ్ అందించబడుతుందని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు. అంటే ఈ వర్చువల్ అసెట్స్‌లో పెట్టుబడి పెట్టేవారు లాభాలను ప్రభుత్వానికి నివేదించాలి. ఆర్థిక లోటును తగ్గించేందుకు ప్రభుత్వంవెతుకుతున్న తరుణంలో ఈ చర్య ఎంతో ఊరటనిస్తుందని ఆయన అన్నారు.

క్రిప్టోపై పన్ను పరిష్కారాన్ని అందించడానికి  
దేశంలోని వర్చువల్ అసెట్స్ కోసం కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత ఆన్‌లైన్ టాక్సేషన్ అండ్ ఫిన్‌టెక్ సాఫ్ట్‌వేర్ ప్రొవైడర్ క్లియర్ (formerly ClearTax) 'క్లియర్ క్రిప్టో ట్యాక్స్' సేవను ప్రవేశపెట్టింది.

దీని వల్ల పెట్టుబడిదారులకు వారి క్రిప్టో అసెస్ట్స్ పోర్ట్‌ఫోలియో అండ్ పన్ను నిర్వహణతో సహాయం చేస్తుంది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ అన్ని ప్రధాన క్రిప్టో ఎక్స్ఛేంజీలు అండ్ డేఫి (Decentralized finance) ప్రోటోకాల్‌తో జతకట్టాలని యోచిస్తోంది. ఇది టి‌డి‌ఎస్, ఇన్‌వాయిస్ అండ్ జి‌ఎస్‌టిలను లెక్కించడంలో సహాయపడుతుంది.
 

PREV
click me!

Recommended Stories

Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !
Post office: రిటైర్మైంట్ త‌ర్వాత బిందాస్‌గా బ‌త‌కొచ్చు.. నెల‌కు రూ. 10 వేలు వ‌చ్చే బెస్ట్ స్కీమ్