టీసీఎస్‌ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. గత ఆరు నెలల వ్యవధిలో రెండోసారి వేతనపెంపు..

By S Ashok KumarFirst Published Mar 20, 2021, 1:40 PM IST
Highlights

2021-22 ఆర్ధిక సంవత్సరానికి  ఇంక్రిమెంట్ ప్రకటించిన మొదటి ఐటి సర్వీసెస్ సంస్థగా టిసిఎస్ నిలిచింది. గత ఏడాది అక్టోబర్‌లో పెంపు ప్రకటించిన తర్వాత మళ్ళీ ఆరు నెలల్లో జీతం పెంపును ప్రకటించడం విశేషం.

భారతదేశపు అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సర్వీస్ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) ఉద్యోగులందరికీ జీతాల పెంపును ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి జీతాల పెంపు అమల్లో ఉంటుందని కంపెనీ తెలిపింది. టిసిఎస్ ప్రతినిధిని మాట్లాడుతూ " 1 ఏప్రిల్ 2021 నుండి మా బెంచ్‌మార్క్‌లకు అనుగుణంగా ఇంక్రిమెంట్లు ఇవ్వనున్నాము."అని తెలిపారు.

"ఈ సమయాల్లో సంస్థను ముందుకు నడిపించడానికి ప్రతిభను ప్రదర్శించినందుకు మా సహచరులందరికీ కృతజ్ఞతలు." అని ఒక ప్రతినిధి తెలిపారు. ముంబైకి చెందిన మా ఐటి సంస్థలో దాదాపు 4.7 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు, ఈ వేతన పెంపు నిర్ణయం వల్ల వారు లబ్ధి పొందనున్నారు.

also read జీన్స్ ప్యాంటు అంటే ఏంటి..? దీనికి చిన్న పాకెట్స్ ఎందుకు ఉన్నాయి ? దీని చరిత్ర, రహస్యాలు ఏంటో తెలుసు...

2021-22 ఆర్ధిక సంవత్సరానికి  ఇంక్రిమెంట్ ప్రకటించిన మొదటి ఐటి సర్వీసెస్ సంస్థగా టిసిఎస్ నిలిచింది. గత ఏడాది అక్టోబర్‌లో పెంపు ప్రకటించిన తర్వాత మళ్ళీ ఆరు నెలల్లో జీతం పెంపును ప్రకటించడం విశేషం. వేతన పెంపుతో పాటు ప్రోమోషన్లు కూడా కొనసాగించనున్నారు.

ఒక నివేదిక ప్రకారం, "ఎఫ్‌వై 22 జీతాల పెంపుతో టిసిఎస్ ఉద్యోగులు గత ఆరు నెలల కాలంలో 12-14% సగటు జీతం పెంపు పొందుతున్నారు.

టిసిఎస్ 2020 డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభంలో 7% పెరుగుదల అంటే రూ. 8,701 కోట్లుగా నమోదైంది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో క్లౌడ్ సేవలకు ఎక్కువ డిమాండ్ ఉన్నందున కంపెనీ లాభపడింది.

click me!