ట్రక్ డ్రైవర్లకు గుడ్ న్యూస్, ట్రక్కులో ఏసీ క్యాబిన్ తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు..

By Krishna Adithya  |  First Published Jul 8, 2023, 12:51 AM IST

దుమ్ము ధూళి, ఎండ, వాన, చలి ఇలా విపరీతమైన పరిస్థితులలో ఎదుర్కొంటూ వేలాది కిలోమీటర్లు ట్రక్కులు నడిపే డ్రైవర్ల కష్టాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. త్వరలోనే ట్రక్కు నడిపే డ్రైవర్ల క్యాబిన్లను ఎయిర్ కండిషన్ తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ సిద్ధం చేసింది.


సుదూర ప్రయాణం చేసే ట్రక్కు డ్రైవర్లకు ఇది గుడ్ న్యూస్.. ఇకపై ట్రక్కు నడిపే డ్రైవర్  క్యాబిన్ లోపల ఎయిర్ కండిషనింగ్ తప్పనిసరి చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదించారు. గడ్కరీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఇలా రాశారు, "N2, N3 కేటగిరీ ట్రక్కుల క్యాబిన్లలో ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ తప్పనిసరి ఇన్ స్టాలేషన్ కోసం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రూపొందించినట్లు ఆయన తెలిపారు.  ట్రక్ డ్రైవర్లు తమ సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు, దూర ప్రయాణాల్లో డ్రైవర్ల వల్ల కలిగే అలసటను తగ్గించడానికి వారికి సౌకర్యవంతమైన పని పరిస్థితులను అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గడ్కరీ తెలిపారు. 

రోడ్డు భద్రతలో ట్రక్ డ్రైవర్ల సహకారం 
రోడ్డు భద్రతకు భరోసా కల్పించడంలో ట్రక్ డ్రైవర్లు ముఖ్యపాత్ర పోషిస్తారని ఈ సందర్భంగా గడ్కరీ అన్నారు. ట్రక్ డ్రైవర్లకు సౌకర్యవంతమైన పని పరిస్థితులను అందించడంలో ఈ నిర్ణయం ఒక ముఖ్యమైన దశ, ఇది వారి సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు డ్రైవర్ అలసట సమస్యను పరిష్కరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

Latest Videos

undefined

భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన రంగాలలో రవాణా ఒకటి. ఇందులో ట్రక్ డ్రైవర్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని గడ్కరీ గత నెలలో చెప్పారు. PTI నివేదిక ప్రకారం, ట్రక్కులకు త్వరలో ఎయిర్ కండిషన్డ్ క్యాబిన్లను తప్పనిసరి చేస్తామని గడ్కరీ చెప్పారు. ట్రక్ డ్రైవర్లు తీవ్రమైన వేడి పరిస్థితుల్లో పని చేయవలసి వస్తోందని, ట్రక్ డ్రైవర్లు ఎయిర్ కండిషన్డ్ క్యాబిన్ల కోసం తాను చాలా కాలంగా ఒత్తిడి చేస్తున్నానని, “కొందరు ఖర్చులు పెరుగుతాయని దీనిని వ్యతిరేకిస్తున్నారు,” అని మంత్రి వాపోయారు. ఇదిలా ఉంటే గత నెలలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భారతదేశంలోనూ, అలాగే అమెరికాలోనూ ట్రక్ లారీలో ప్రయాణించి ఇరు దేశాల్లో డ్రైవర్ల సమస్యలను అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా అమెరికాలో ట్రక్ డ్రైవర్ గా పనిచేస్తున్న భారతీయుడు రాహుల్ గాంధీతో మాట్లాడుతూ, మన దేశంలో కూడా ట్రక్ డ్రైవర్లకు ఏసీ కేబిన్ లు ఏర్పాటు చేస్తే మంచిదని సూచించారు. యాదృచ్చికంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సైతం ఈ నిర్ణయమే తీసుకోవడం విశేషం. 

ఆటోమొబైల్ పరిశ్రమ టర్నోవర్‌ను రెట్టింపు చేయాలనుకుంటున్న ప్రభుత్వం: గడ్కరీ
ఆటోమొబైల్ పరిశ్రమ టర్నోవర్‌ను ప్రస్తుతం రూ.7.5 లక్షల కోట్ల నుంచి రూ.15 లక్షల కోట్లకు రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు నితిన్ గడ్కరీ ఇటీవల చెప్పారు. రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో గడ్కరీ మాట్లాడుతూ గత రెండు దశాబ్దాల్లో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను పునురుద్ఘాటించారు.  

ఆటోమొబైల్ పరిశ్రమ టర్నోవర్ రూ.7.55 లక్షల కోట్లుగా ఉందని,  ఈ రంగంలో నాలుగున్నర మిలియన్ల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఈ పరిశ్రమ ప్రభుత్వానికి గరిష్టంగా GSTని చెల్లిస్తుంది. 15 లక్షల కోట్లతో ఈ పరిశ్రమను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరిశ్రమ ద్వారా పది కోట్ల ఉద్యోగాలు వస్తాయని ఆయన అన్నారు.  ఆటోమొబైల్ తయారీలో జపాన్‌ను వెనక్కి నెట్టి, చైనా, అమెరికా తర్వాత ప్రపంచంలోనే భారత్ మూడో స్థానానికి చేరుకుందన్నారు. 

click me!