డ్రోన్ తయారీ సంస్థ ఐడియాఫోర్జ్ టెక్నాలజీ షేర్లు శుక్రవారం స్టాక్ ఎక్స్ఛేంజీలలో 94 శాతం లాభంతో లిస్ట్ అయ్యాయి. దీని ఇష్యూ ధర రూ.672 కాగా Ideaforge స్క్రిప్ BSEలో రూ. 1,305.10 వద్ద లిస్ట్ అయ్యింది. ఇష్యూ ధర కంటే 94.21 శాతం ప్రీమియంతో లిస్ట్ అవడంతో ఇన్వెస్టర్లకు జాక్ పాట్ తగిలినట్లయ్యింది.
డ్రోన్‌లను తయారు చేసే భారతీయ కంపెనీ ఐడియాఫోర్జ్ టెక్ IPO ఈరోజు స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో బంపర్ లిస్టింగ్‌ను అందుకుంది. ఇందులో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లకు మంచి లాభాలు వచ్చాయి. Idea Forge Technology Limited IPO ఇన్వెస్టర్ల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ ఆధారంగా ఐడియాఫోర్జ్ స్టాక్ లిస్టింగ్ సుమారు రూ. 1,200 వద్ద అవుతుందని అంతా అంచనా వేశారు. కానీ బంపర్ బౌన్స్‌తో ఈ షేరు రూ.1305.10 వద్ద లిస్ట్ అయ్యింది. స్టాక్ ఎక్స్ఛేంజీలో 94% ప్రీమియంతో లిస్ట్ అవడంతో షేర్లు అలాట్ అయిన వారు పండగ చేసుకున్నారు.అయితే ఇదే షేరు మరోవైపు రూ.1300 ధరతో ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్ అయ్యింది
Idea Forge Technology Limited లిస్టింగ్ ముందుగా జూలై 10, 2023న కావాల్సి ఉంది. కానీ తర్వాత దాని తేదీని మార్చారు. ముందుగా నిర్ణయించిన తేదీ కంటే ముందే కంపెనీ తన IPOను లిస్టింగ్ చేయాలని నిర్ణయించుకుంది. Ideaforge IPOకి సబ్ స్క్రిప్షన్ పొందే తేదీ ముందుగా జూన్ 26-29గా నిర్ణయించారు, అయితే స్టాక్ మార్కెట్ సెలవుల క్యాలెండర్‌లో మార్పును అనుసరించి, కంపెనీ IPOకి సబ్ స్క్రిప్షన్ పొందే చివరి తేదీ జూన్ 30, 2023 వరకు పొడిగించారు.
IdeaForge Tech IPO భారీగా సబ్‌స్క్రైబ్ అయ్యింది. అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారుల కోసం రిజర్వ్ కేటగిరీ 125.81 రెట్లు సబ్ స్క్రిప్షన్ పొందింది. అదే సమయంలో, ఈ IPO NII కోటాలో మొత్తం 80.58 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ను పొందింది. ఉద్యోగుల కోసం రిజర్వ్ చేయబడిన కేటగిరీలో IPO 96.65 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది.
IdeaForge Tech IPO జూన్ 26న ఆఫర్ తెరుచుకొని జూన్ 29 వరకు ఆఫర్ తెరుచుకుంది. కంపెనీ ఒక్కో షేరు ధర రూ.638-672గా నిర్ణయించారు. ఆఫర్ కోసం కనీసం ఒక లాట్ కు 22 షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంది. అంటే ఒక పెట్టుబడిదారు దాని ఎగువ ధర బ్యాండ్ ద్వారా ఒక లాట్ కోసం దరఖాస్తు చేయాలంటే రూ. 14,784 పెట్టుబడి పెట్టాలి.
గ్రే మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించింది
ఐడియాఫోర్జ్ టెక్నాలజీస్ IPO గ్రే మార్కెట్‌లో బాగా పనిచేసింది. లిస్టింగ్‌కు ముందు, కంపెనీ స్టాక్ గ్రే మార్కెట్‌లో ఒక్కో షేరుకు రూ.510-515 ప్రీమియం నమోదు చేసింది. మరోవైపు, ఈ ఐపీఓ కింద షేర్లను కేటాయించని బిడ్డర్లకు జూలై 5 నుంచి రీఫండ్ చేయడం ప్రారంభించింది. జూలై 6 నాటికి స్టాక్‌లను కేటాయించిన విజయవంతమైన బిడ్డర్‌ల డీమ్యాట్ ఖాతాలకు కంపెనీ షేర్లు జమ చేశారు.