బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్.. దిగోస్తున్న పసిడి ధర..! కొత్త ధరలు ఇవే..

Published : Jul 13, 2022, 10:18 AM IST
బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్.. దిగోస్తున్న  పసిడి ధర..! కొత్త ధరలు ఇవే..

సారాంశం

బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ ద్వారా హాల్‌మార్క్‌ ఇస్తారు. 24 క్యారెట్ల బంగారంపై 999, 23 క్యారెట్‌పై 958, 22 క్యారెట్‌పై 916, 21 క్యారెట్‌పై 875, 18 క్యారెట్‌పై 750.

ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా బంగారం, వెండి ధరలు గత వారం నుంచి చాలాసార్లు హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. అలాగే బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. మీరు బంగారం, వెండిని కొనుగోలు చేయాలనుకుంటే లేదా మీరు బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ వార్తా మీకోసమే. 

బంగారం స్వచ్ఛతను ఎలా గుర్తించాలి
 బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ ద్వారా హాల్‌మార్క్‌ ఇస్తారు. 24 క్యారెట్ల బంగారంపై 999, 23 క్యారెట్‌పై 958, 22 క్యారెట్‌పై 916, 21 క్యారెట్‌పై 875, 18 క్యారెట్‌పై 750. చాలా వరకు బంగారం 22 క్యారెట్లలో అమ్ముడవుతుండగా, కొందరు 18 క్యారెట్లను కూడా ఉపయోగిస్తున్నారు. క్యారెట్ ఎక్కువగా ఉంటే బంగారం స్వచ్ఛంగా ఉంటుంది.

22, 24 క్యారెట్ బంగారం మధ్య తేడా ఏమిటి
22 అలాగే 24 క్యారెట్ బంగారం మధ్య వ్యత్యాసం కూడా ఉంది. 24 క్యారెట్ల బంగారం 99.9 శాతం స్వచ్ఛమైనది, 22 క్యారెట్ 91 శాతం స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారంలో 9% రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలను కలపడం ద్వారా ఆభరణాలను తయారు చేస్తారు. 24 క్యారెట్ల బంగారం స్వచ్ఛమైనది అలాగే  దానితో బంగారు ఆభరణాలు చేయలేరు. అందుకే చాలా మంది దుకాణదారులు 22 క్యారెట్ల బంగారాన్ని విక్రయిస్తున్నారు.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 51,054గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,800, 24 క్యారెట్ల ధర రూ. 51,054. 
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,700గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 50,950 వద్ద ఉంది. 
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,850, 24 క్యారెట్ల ధర రూ. 51,100.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 46,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,054గా ఉంది.

PREV
click me!

Recommended Stories

Atal Pension yojana: రూ. 500 చెల్లిస్తే చాలు.. నెల‌కు రూ. 5 వేల పెన్ష‌న్. ఈ స్కీమ్ గురించి తెలుసా?
Gold Price: 2026లో తులం బంగారం ఎంత కానుందంటే.. తెలిస్తే వెంట‌నే కొనేస్తారు