Gold Rate: పసిడి ప్రియులకు శుభవార్త, 10 గ్రాముల బంగారం ఏకంగా రూ.2000 తగ్గింది, మరింకెందుకు ఆలస్యం..

Published : Feb 17, 2023, 09:36 AM IST
Gold Rate: పసిడి ప్రియులకు శుభవార్త, 10 గ్రాముల బంగారం ఏకంగా రూ.2000 తగ్గింది, మరింకెందుకు ఆలస్యం..

సారాంశం

బంగారం నగల షాపింగ్ కోసం వెళ్తున్నారా అయితే వెంటనే ఈరోజు శుక్రవారం బంగారం ధరలను తెలుసుకోండి తద్వారా మీకు సమయం వృధా కాదు. ఈరోజు బంగారం ధరలు ఏకంగా గరిష్ట స్థాయితో పోల్చినట్లయితే దాదాపు 2000 రూపాయల వరకు తగ్గిందనే చెప్పవచ్చు.

దేశవ్యాప్తంగా బంగారం ధరలు తక్కువ ముఖం పడుతున్నాయి ముఖ్యంగా ప్రధాన నగరాలు అయినటువంటి ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో కూడా బంగారం ధరల్లో చాలా తేడా వచ్చింది. గత వారం బంగారం రికార్డు స్థాయిని తాకినప్పటికీ అక్కడి నుంచి నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది ప్రస్తుతం బంగారం ధర, భారీగా తగ్గింది.  గత 24 గంటల్లో భారత్‌లో బంగారం ధరలను గమనించినట్లయితే. ఫిబ్రవరి 17 నాటికి దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 56,730గా నమోదు కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) రూ. 51,730గా నమోదైంది. 

భారతదేశంలోని ప్రధాన నగరాల్లో సైతం  బంగారం ధరలలో హెచ్చుతగ్గులను నమోదు చేశాయి. హైదరాబాద్ లో ఈరోజు బంగారం ధర 24 క్యారెట్లు (10 గ్రాములు) రూ.56,800 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ.51,800గా నమోదైంది. 

ఏపీ రాజధాని విజయవాడలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 56,880 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ. 52,150గా నమోదు అయ్యింది. చెన్నైలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 56,950 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ. 52,000. మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.56,730 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.52,000గా ఉంది. పొద్దుటూరులో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 56,730 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 51,700గా ఉంది. 

బంగారం ధరలు గరిష్ట స్థాయి అయినటువంటి రూ. 58,500 నుంచి తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనం బంగారం ధరలను పోల్చినట్లయితే రికార్డు స్థాయి నుంచి దాదాపు 2 వేల వరకు తగ్గిందనే చెప్పాలి.  దీంతో పసిడి ప్రేమికులకు మంచి అవకాశం దక్కిందని చెప్పవచ్చు ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఎవరైతే ఆభరణాలు కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు ఎప్పటికప్పుడు బంగారం ధరను తెలుసుకోవడం తప్పనిసరి.  ధర తక్కువ ఉన్న రోజు మనం బంగారం షాపింగ్ ప్లాన్ చేసుకుంటే ఎంతో కొంత కలిసి వస్తుందని చెప్పవచ్చు. 

బంగారం  ధరలు అంతర్జాతీయంగా పలు అంశాలపై ఆధారపడి ఉంటాయి ముఖ్యంగా అమెరికాలోని కమోడిటీ ఎక్స్చేంజ్ మార్కెట్లో బంగారం ధరలు నిర్ణయిస్తారు ప్రస్తుతం న్యూయార్క్ కమోడిటీ ఎక్స్చేంజ్ మార్కెట్లో ఔన్స్ అంటే 31 గ్రాములు బంగారం ధర1860  డాలర్లుగా పలుకుతోంది.  ఈ రేంజ్ నుంచి  బంగారం మరింత తగ్గినట్లయితే  దేశీయంగా కూడా రిటైల్ మార్కెట్లో బంగారం ధరలు దిగి వస్తాయి. 

 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Home Loan: ఇల్లు కొంటున్నారా? తక్కువ వడ్డీతో హోమ్ లోన్ ఇచ్చే బ్యాంకులు ఇవిగో
Personal Loan: శాలరీ స్లిప్ లేకుండా వెంటనే పర్సనల్ లోన్.. ఈ పత్రాలతో గంటల్లో అప్రూవల్ !