LPG Cylinder Price: దసరా పండగ ముందు గుడ్ న్యూస్, భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర, ఎంత తగ్గిందంటే..?

By Krishna AdithyaFirst Published Oct 2, 2022, 11:46 AM IST
Highlights

ఈ పండుగల సీజన్లో సామాన్యుడి జేబు భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ సిలిండర్ ధరను భారీగా తగ్గించింది. దీంతో ఎల్పీజీ సిలిండర్ ధరలు దిగివచ్చాయి. తాజాగా సిలిండర్ ధర ఎంత ఉందో తెలుసుకుందాం.

దసరా పండగ నేపథ్యంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించింది. దీంతో వంటగదిలో ఇంధన ఖర్చుకు కాస్త ఉపశమనం కలిగింది. అక్టోబర్ ప్రారంభంలోనే, ఎల్‌పిజి సిలిండర్ల కొత్త ధరలను విడుదల చేశారు. అక్టోబరు 1న చమురు కంపెనీలు ఎల్‌పీజీ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు, కానీ వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గుముఖం పట్టాయి.

నేటి నుంచి ఢిల్లీలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.25.50 తగ్గింది. ముంబై ఈ ధర రూ.32.50 తగ్గింది. కోల్‌కతాలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలో రూ.36.50 తగ్గింపు నమోదైంది. హైదరాబాద్ లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.35.50 తగ్గింది. ఈ నేపథ్యంలో , పండుగ ముందు, వినియోగదారులకు ఇది ఒక రిలీఫ్ న్యూస్ ఎందుకంటే దీని కారణంగా కమర్షియల్ సిలిండర్స్ వినియోగించే వారికి భారం తగ్గుతుంది. 

19 కిలోల ఎల్‌పిజి సిలిండర్ అక్టోబర్ 1, 2022 నుండి ఢిల్లీలో రూ.1859.50కి అందుబాటులో ఉంటుంది. ముంబైలో రూ.1811.50, కోల్‌కతాలో రూ.1959.00, చెన్నైలో ఈ గ్యాస్ సిలిండర్ రూ.2009.50కి అందుబాటులో ఉంటుంది. విశేషమేమిటంటే వరుసగా ఆరో నెల కూడా వాణిజ్య సిలిండర్ల ధరలు తగ్గాయి. ఈ తగ్గింపుతో రెస్టారెంట్, హోటల్ నడిపే వారికి కాస్త ఉపశమనం కలిగింది. అంతకుముందు సెప్టెంబర్‌లో కూడా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధర రూ.100 వరకు తగ్గింది.

మరోవైపు, 14.2 కిలోల ఇళ్లల్లో వాడే డొమెస్టిగ్ గ్యాస్ సిలిండర్ గురించి మాట్లాడినట్లయితే, జూలై 6 నుండి దాని ధరలలో ఎటువంటి మార్పు లేదు. రాజధాని ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1,053. మరోవైపు, మనం ఆర్థిక రాజధాని ముంబై గురించి మాట్లాడినట్లయితే, డొమెస్టిక్ సిలిండర్ ఇక్కడ రూ. 1,052, కోల్‌కతాలో రూ. 1,079 మరియు చెన్నైలో రూ. 1,068కి అందుబాటులో ఉంది.

CNG ధర పెరిగింది
గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ మార్కెట్‌లో సహజవాయువు ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో, దేశీయ సహజ వాయువు ధరను 40% పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది, ఇది అక్టోబర్ 1, 2022 నుండి చేయబడింది. సహజ వాయువు ధర mmBtuకు 6.1 డాలర్ల నుండి mmBtuకి 8.57 డాలర్లకి పెరిగింది. 

దీంతో రానున్న రోజుల్లో దేశంలో ద్రవ్యోల్బణం తగ్గుతుందని అంచనా. మరోవైపు, ఈ రోజు పెట్రోల్ మరియు డీజిల్ ధర గురించి మాట్లాడితే, ఈ రోజు దాని ధరలో ఎటువంటి మార్పు లేదు. దేశంలో వరుసగా 133వ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.

click me!