పండుగ సీజన్ లో షాకిస్తున్న పసిడి ధరలు.. దీపావళి నాటికి బంగారం ధర..?

By asianet news teluguFirst Published Oct 1, 2022, 10:20 AM IST
Highlights

ప్రపంచవ్యాప్తంగా బంగారం, వెండి ధరలలో అస్థిరత స్థిరంగా ఉంది. నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,680. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 50, 930గా ఉంది.

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) పెంచిన తర్వాత భారతదేశంలో బంగారం ధరలు పెరిగాయి.  పసిడి పై విధించే పన్నుల కారణంగా ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, లక్నో ఇతర రాష్ట్రాల్లో బంగారం ధర మారుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆర్‌బి‌ఐ రేట్ల పెంపు ప్రకటన తర్వాత భారత రూపాయి కూడా పుంజుకుంది. భారతీయ కరెన్సీ గత 20 రోజుల్లో అత్యధిక లాభాలను నమోదు చేసింది.  

ప్రపంచవ్యాప్తంగా బంగారం, వెండి ధరలలో అస్థిరత స్థిరంగా ఉంది. నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,680. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 50, 930గా ఉంది. సాధారణంగా 24 క్యారెట్ల బంగారాన్ని స్వచ్ఛమైనదిగా పరిగణిస్తారు, అయితే ఈ బంగారంతో నగలు తయారు చేయలేరు ఎందుకంటే ఇది చాలా మృదువైనది. అందువల్ల ఎక్కువగా 22 క్యారెట్ల బంగారాన్ని ఆభరణాలు లేదా ఆభరణాల తయారీలో ఉపయోగిస్తారు. అయితే ఈ దీపావళి పండుగ నాటికి 10 గ్రాములకి రూ.52,500 వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు  IIFL అనూజ్ గుప్తా తెలిపారు.

 ప్రముఖ నగరాల్లో..
-ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,900. 
-ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000గా ఉంది. 
-కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000 ఉంది.
-బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 వద్ద ఉంది.
- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,900 వద్ద ఉంది.
-హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,900 వద్ద ఉంది. 
-హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.62,000
-విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,900 ఉంది.

ఏ క్యారెట్ బంగారం స్వచ్ఛమైనది
24 క్యారెట్ల బంగారం 99.9 శాతం.
23 క్యారెట్ల బంగారం 95.8 శాతం.  
22 క్యారెట్ల బంగారం 91.6 శాతం.
21 క్యారెట్ల బంగారం 87.5 శాతం.
18 క్యారెట్ల బంగారం 75 శాతం.
17 క్యారెట్ల బంగారం 70.8%.  
14 క్యారెట్ల బంగారం 58.5 శాతం.
9 క్యారెట్ల బంగారం 37.5%.

షాపింగ్ చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి
కస్టమర్లు  బంగారాన్ని కొనే సమయంలో బంగారం నాణ్యతను చూసుకోవడం చాలా ముఖ్యం. కస్టమర్లు హాల్‌మార్క్ గుర్తును చూసిన తర్వాత మాత్రమే బంగారాన్ని కొనుగోలు చేయాలి. ప్రతి క్యారెట్‌కు భిన్నమైన హాల్‌మార్క్ నంబర్ ఉంటుంది. హాల్‌మార్క్ బంగారంపై ప్రభుత్వ హామీ, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) హాల్‌మార్క్‌ని నిర్ణయిస్తుంది.  
 

click me!