రతన్ టాటా తన ఏడు నెలల కుక్క కోసం రక్తదాత(blood donor)ని వెతుకుతున్నారు. దీనిపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేస్తూ, తన కుక్క కోసం రక్త దాతను వెతకడంలో సహాయం చేయాలని రిక్వెస్ట్ చేశారు.
ముంబై : రతన్ టాటా పెట్ హాస్పిటల్లో చేరిన ఓ ఏడు నెలల కుక్క కోసం రక్తదాతని వెతుకుతున్నారు. దీనికి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ షేర్ చేస్తూ తన కుక్క కోసం రక్త దాతను వెతకడంలో సహాయం చేయండి అంటూ రిక్వెస్ట్ చేశారు. తన పోస్ట్‌లో కుక్క ఆరోగ్యపరిస్థితి గురించి... దానికి ఏం అవసరమో వివరించారు. కుక్కను బ్రతికించడంకోసం రతన్ టాటా పడుతున్న తాపత్రయం జంతుప్రేమికులనే కాదు మానవత్వం కలిగిన ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది.
రతన్ టాటా తెలిపిన వివరాల ప్రకారం... సదరు డాగ్ రక్తహీనతతో బాధపడుతున్న... దాని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ డాగ్ కు రక్తం అవసరమని ఆయన తెలిపారు. అయితే రక్తదాత కుక్క కోసం అర్హత ప్రమాణాలను కూడా షేర్ చేసారు.ఇప్పటివరకు రతన్ టాటా షేర్ చేసిన పోస్ట్‌కి 4.8 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి.
రతన్ టాటా ఓ పెద్ద జంతు ప్రేమికుడు. ఆపదలో ఉన్న కుక్కను ఆదుకునేందుకు రతన్ టాటా సోషల్ మీడియాను పోస్ట్ చేయడం ఇదేం మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా ఆయన కాపాడిన కుక్కను దాని యజమాని వద్దకు చేర్చడానికి ఇలాగే Instagramని ఉపయోగించారు.
టాటా ట్రస్ట్ దాదాపు రూ.165 కోట్ల వ్యయంతో 2.2 ఎకరాల్లో విస్తరించిన ఓ వెటర్నరీ ఆసుపత్రిని నిర్వహిస్తోంది. కుక్కలు, పిల్లులు, కుందేళ్లు వంటి చిన్న జంతువులకు సంబంధించిన కొన్ని ఆసుపత్రులలో ఇదీ ఒకటి. ఈ ఆసుపత్రి 24x7 పని చేస్తుంది.