
నేడు 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ప్రస్తుతం రూ.51,160 వద్ద ట్రేడవుతుండడంతో సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో బంగారం, వెండి ధరలు మారలేదు. మరోవైపు వెండి కిలో రూ.55,100గా ఉంది. కాగా, సోమవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.46,900 వద్ద ట్రేడవుతోంది. గ్లోబల్ ట్రేడింగ్‌లో సోమవారం బంగారం ధర 0.14 శాతం తగ్గి ఔన్స్‌కు 1,724.05 డాలర్లకు చేరుకుంది.
ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.51,160గా ఉంది. కాగా ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900గా ఉంది. చెన్నైలో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.51,230, 22 క్యారెట్ల బంగారం రూ.46,960గా ట్రేడవుతోంది.
ముంబై, ఢిల్లీ, కోల్‌కతాలో కిలో వెండి రూ.55,100గా ఉంది. కాగా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలో కిలో వెండి సోమవారం రూ.61,000 వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్‌లో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 46,900 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,160గా ఉంది.
స్పాట్ సిల్వర్ 0.6% క్షీణించి ఔన్స్‌కు $18.48 వద్ద, ప్లాటినం 0.6% తగ్గి $868.62కి, పల్లాడియం 1.5% పడిపోయి $1,999.94కి చేరుకుంది. సెంట్రల్ రిజర్వ్ బ్యాంకుల్లో పసిడి నిల్వ, డాలర్ వాల్యు, వివిధ దేశాల భౌతిక పరిస్థితులు వంటి పరిణామాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి.
ఇక్కడ పేర్కొన్న ధరలు స్థానిక ధరలకు సమానంగా ఉండకపోవచ్చు. TDS, GST అండ్ విధించబడిన ఇతర పన్నులను చేర్చకుండా ఈ డేటాను చూపుతుంది.