నేడు బంగారం కొనేందుకు మంచి ఛాన్స్.. 10 గ్రాముల పసిడి ధర పెరిగిందా తగ్గిందా తెలుసుకోండి..

By asianet news teluguFirst Published Feb 8, 2023, 10:46 AM IST
Highlights

భారతదేశంలోని ప్రముఖ నగరాలలో బంగారం ధరలలు స్థిరంగా ఉన్నాయి. ఈరోజు చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,927గా ఉంది.
 

బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ కొన్ని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అలాగే  పసిడి ధర తగ్గుతుందని సామాన్యులు ఎదురు చూస్తున్నారు.  అయితే  గత 24 గంటల్లో భారత్‌లో బంగారం ధరల్లో కాస్త వ్యత్యాసం కనిపిస్తుంది.

ఫిబ్రవరి 8 బుధవారం నాటికి 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 57,360 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 52,550.

భారతదేశంలోని ప్రముఖ నగరాలలో బంగారం ధరలలు స్థిరంగా ఉన్నాయి. ఈరోజు చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,927గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,700 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 52,900. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,550 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 52,750. మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,550 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,750గా ఉంది.

భువనేశ్వర్‌లో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 57,550 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర  రూ. 52,750.

మరోవైపు హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలలో ఈరోజు బంగారం ధరలు చూస్తే బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ. 100 పెంపుతో  రూ. 52,750, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 110 పెంపుతో రూ.57,550. హైదరాబాద్‌లో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 100 పెంపుతో  రూ. 52,750, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పెంపుతో రూ. 57,550. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,750, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,550. విశాఖపట్నంలో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 52,750, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,550. మరోవైపు హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 74,000.

 బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ ద్వారా హాల్ మార్కులు ఇస్తారు. 24 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 999, 23 క్యారెట్‌ల ఆభరణాలపై 958, 22 క్యారెట్‌ ఆభరణాలపై 916, 21 క్యారెట్‌ ఆభరణాలపై 875, 18 క్యారెట్‌ ఆభరణాలపై 750 అని ఉంటుంది. ఎక్కువగా బంగారాన్ని 22 క్యారెట్లలో విక్రయిస్తుండగా, కొందరు 18 క్యారెట్లను కూడా ఉపయోగిస్తున్నారు. 

24 క్యారెట్ బంగారం 99.9 శాతం స్వచ్ఛమైనది, 22 క్యారెట్ 91 శాతం స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారంలో 9% రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలను కలపడం ద్వారా ఆభరణాలను తయారు చేస్తారు. 24 క్యారెట్ల బంగారం మృదువైనది అయితే, 24 క్యారెట్ల బంగారంతో ఆభరణాలు చేయలేరు. అందుకే చాలా మంది దుకాణదారులు 22 క్యారెట్ల బంగారాన్ని విక్రయిస్తున్నారు.

click me!