బంగారం, వెండి ధరల పరుగులు.. షాపింగ్ చేసే ముందు నేటి ధరలు తెలుసుకోండి..

By asianet news teluguFirst Published Dec 15, 2022, 10:26 AM IST
Highlights

ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, కేరళ అండ్ పూణేలలో 10 గ్రాముల బంగారం 24 క్యారెట్ల ధర  రూ. 54,880, 22 క్యారెట్ల  ధర రూ. 50,300 వద్ద అమ్ముడవుతోంది.

నేడు గురువారం ప్రారంభ ట్రేడింగ్‌లో బంగారం, వెండి ధరలు కాస్త పెరిగాయి, పది గ్రాముల పసిడి (24 క్యారెట్లు) ధర రూ. 550 పెరిగి రూ. 54,880 వద్ద ట్రేడవుతున్నాయి. మరోవైపు నేడు వెండి కిలోకు రూ.71,000 వద్ద ట్రేడవుతోంది. ఒక  నివేదిక ప్రకారం, ఈ రోజు పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,300 వద్ద ట్రేడవుతోంది.

ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, కేరళ అండ్ పూణేలలో 10 గ్రాముల బంగారం 24 క్యారెట్ల ధర  రూ. 54,880, 22 క్యారెట్ల  ధర రూ. 50,300 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర  రూ. 55,040, 22 క్యారెట్ల  ధర రూ. 50,450 వద్ద ట్రేడవుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,640, 22 క్యారెట్ల  ధర రూ.51,000 వద్ద ట్రేడవుతోంది.

0035 GMT నాటికి స్పాట్ బంగారం 0.1% పడిపోయి ఔన్సుకు $1,806.11కి చేరింది. US బంగారు ఫ్యూచర్లు $1,817.80 వద్ద కొద్దిగా మారాయి. ముంబై, ఢిల్లీ, కోల్‌కతాలో ఈరోజు కిలో వెండి ధర రూ.71,000 వద్ద ట్రేడవుతోంది. కాగా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలో కిలో వెండి ధర రూ.74,000గా ఉంది.

స్పాట్ సిల్వర్ 0.4% తగ్గి $23.81డాలర్లకి, ప్లాటినం 0.1% నష్టపోయి $1,027.82డాలర్లకి, పల్లాడియం 0.1% తగ్గి $1,914.98డాలర్లకి చేరుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్-బ్యాక్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్ SPDR గోల్డ్ ట్రస్ట్ హోల్డింగ్‌లు బుధవారం 0.1% తగ్గి 911.56 టన్నులకు పడిపోయాయి. 

తాజా కాలంలో బంగారం ధరలు అస్థిరంగా ఉండడం, భారత రూపాయి బలహీనపడడమే ఇందుకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇక్కడ పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 8 గంటలకు ముగుస్తాయి ఇంకా ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ కరెన్సీ ధరలలో మార్పు, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు  అనేక ఇతర కారణాల వల్ల బంగారం ధరలో హెచ్చుతగ్గులకు కారణాలు అని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.  

click me!