దిగొస్తున్న బంగారం, వెండి ధరలు .. పసిడి ప్రియులు కొనే ముందు ఈ ధరలు తెలుసుకోండి..

By asianet news teluguFirst Published Dec 7, 2021, 11:27 AM IST
Highlights

బంగారం ధరలు(gold prices) నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్(international market) పరిస్థితుల్ని బట్టి బంగారం ధరలు మారుతుంటాయి. అయితే  గతంలో కంటే ప్రస్తుత రోజుల్లో బంగారం, వెండి ధరలు కాస్త దిగోచ్చి పసిడి ప్రియులకు ఊరటనిస్తున్నాయి.
 

నేడు మల్టీ కమోడిటీ  ఎక్స్ఛేంజ్ లో 24 క్యారెట్ల బంగారం ధర మళ్లీ పడిపోయింది. మంగళవారం ఎంసీఎక్స్‌లో బంగారం ధర 0.21 శాతం తగ్గింది. ఈ పతనంతో 10 గ్రాముల బంగారం ధర రూ.47,811కి చేరింది. అలాగే  వెండి మెరుపు కూడా ఈ రోజు మసకబారింది. దీని ధర 0.09 శాతం తగ్గి కిలో రూ.61,216కు చేరుకుంది. సోమవారం కూడా బంగారం ధర కాస్త తగ్గింది. విలువైన పసుపు లోహం 0.07 శాతం తగ్గి 10 గ్రాములకు రూ.47,870 వద్ద ట్రేడవుతుండగా, వెండి కిలో ధర స్వల్పంగా పెరిగి రూ.61,599 వద్ద ఉంది. 

మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఫిబ్రవరి గోల్డ్ కాంట్రాక్టులు ఉదయం  09:15 గంటల వద్ద 0.08 శాతం తగ్గి 10 గ్రాములకు రూ. 47,875 వద్ద ట్రేడవుతున్నాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో 0.11 శాతం తగ్గి రూ.61,202 వద్ద ట్రేడవుతోంది.

సోమవారం డాలర్ ఇండెక్స్‌లో స్ట్రెంత్, యూ‌ఎస్ బాండ్ ఈల్డ్‌లు పుంజుకోవడంతో బంగారం, వెండి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లలో ఈ‌ రెండు విలువైన లోహాలు బలహీనంగా ఉన్నాయి.

గోల్డ్ ఫిబ్రవరి ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ట్రాయ్ ఔన్స్‌కు 1779.50 డాలర్ల వద్ద, సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ట్రాయ్ ఔన్స్‌కి 22.26 డాలర్ల వద్ద స్థిరపడింది. రూపాయి బలహీనత కారణంగా దేశీయ మార్కెట్లలో రెండు విలువైన లోహాలు మిశ్రమ నోట్‌పై స్థిరపడ్డాయి.

నేడు ఈ రెండు విలువైన లోహాలు అస్థిరంగా ఉంటాయని, ట్రాయ్ ఔన్స్‌కి  1750 డాలర్లకి ట్రాయ్ ఔన్స్‌కు 22 డాలర్ల కీలక మద్దతు స్థాయిలను కలిగి ఉండవచ్చని మేము భావిస్తున్నాము" అని పృథ్వీఫిన్‌మార్ట్ కమోడిటీ రీసెర్చ్ హెడ్-కమోడిటీ & కరెన్సీ రీసెర్చ్ డైరెక్టర్ మనోజ్ కుమార్ జైన్ చెప్పారు. 

also read  వెంటాడుతున్న ఓమిక్రాన్ భయాలు.. స్టాక్ మార్కెట్ తో సహ క్రిప్టోకరెన్సీ మార్కెట్ భారీగా క్రాష్..

డాలర్ ఇండెక్స్‌లో స్ట్రెంత్, యునైటెడ్ స్టేట్స్‌లో బెంచ్‌మార్క్ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్‌లలో పుంజుకోవడం మధ్య సోమవారం బంగారం, వెండి ధరలు తగ్గాయని నిపుణులు సూచిస్తున్నారు. డాలర్ ఇండెక్స్ 96 మార్కులకు పైగా కదులుతోంది మరియు బాండ్ ఈల్డ్‌లు కూడా సోమవారం మళ్లీ 1.40% మార్కులను దాటాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,910 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51170 రూపాయలుగా ఉంది. 
ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,510గా ఉంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,510గా ఉంది. 
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,800 ఉంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,180గా ఉంది. 
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,100, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,800గా ఉంది. 
కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర రూ.44,760, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,830గా ఉంది. 
కేరళలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,760 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,830గా ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,760 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,830గా ఉంది. 

ఈ విధంగా బంగారం స్వచ్ఛతను తెలుసుకోండి
ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర పన్నులు ఇంకా మేకింగ్ ఛార్జీల కారణంగా దేశవ్యాప్తంగా బంగారం ధర మారుతుంటుంది. ఆభరణాల తయారీకి ఎక్కువగా 22 క్యారెట్లను ఉపయోగిస్తారు. కొంతమంది 18 క్యారెట్ల బంగారాన్ని కూడా ఉపయోగిస్తారు. ఆభరణాలపై క్యారెట్‌ను బట్టి హాల్‌ మార్క్‌ను ముద్రిస్తారు. 24 క్యారెట్ల బంగారంపై 999, 23 క్యారెట్‌లపై 958, 22 క్యారెట్‌పై 916, 21 క్యారెట్‌పై 875, 18 క్యారెట్‌పై 750 అని ఉంటుంది.

మీ నగరంలో బంగారం, వెండి ధరలను ఇలా తెలుసుకోండి
ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర పన్నులు ఇంకా మేకింగ్ ఛార్జీల కారణంగా దేశవ్యాప్తంగా బంగారు ఆభరణాల ధరలు మారుతూ ఉంటాయి. మీరు మీ నగరంలో బంగారం ధరను మొబైల్‌లో కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ ప్రకారం మీరు 8955664433 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ధరను చెక్ చేయవచ్చు. ఈ విధంగా ఇంట్లో కూర్చున్న బంగారం తాజా ధర మీకు తెలుస్తుంది.
 

click me!