గోల్డ్ రికార్డు.. ఆకాశానికి చేరిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..?

By Ashok kumar Sandra  |  First Published Apr 12, 2024, 10:43 AM IST

బంగారం, వెండి ఇంకా  ప్లాటినం అనే మూడు విలువైన లోహాలకు బులియన్ మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అయితే బంగారం, వెండి మాత్రం మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తాయి. 


దేశవ్యాప్తంగా  బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. దింతో పాటు బంగారు ఆభరణాల కొనుగోలు నుండి గోల్డ్ ఇటిఎఫ్‌లు, బంగారు బాండ్‌లకు కూడా డిమాండ్  పెరిగింది. బంగారం,వెండి ధరలు రికార్డ్ హైకి  చేరుకోవడంతో కస్టమర్లలో ఆందోళన నెలకొంది. 

బంగారం, వెండి ఇంకా  ప్లాటినం అనే మూడు విలువైన లోహాలకు బులియన్ మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అయితే బంగారం, వెండి మాత్రం మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తాయి. 

Latest Videos

 ఏప్రిల్‌ మొదటి 10  రోజుల్లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పుంజుకుని పైకి దూసుకెళ్లాయి. కొత్త ఆర్థిక సంవత్సరం తొలిరోజునే  బంగారం ధరలు ఆకాశాన్నంటగా, వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. బులియన్ మార్కెట్ హెచ్చుతగ్గులు కొనసాగడంతో, విలువైన లోహాలు సరికొత్త రికార్డును నెలకొల్పాయి.

 నేడు  శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర పెరిగింది. దింతో పది గ్రాముల ధర  రూ. 72,230 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు వెండి ధర రూ.100 పడిపోయి కిలోకి  రూ.84,900 వద్ద ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగి రూ.66,210గా ఉంది.

ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.72,230గా ఉంది.

కోల్‌కతాలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.72,230గా ఉంది. 

 హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.72,230గా ఉంది.

ఢిల్లీలో  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.72,380, 

 బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర   రూ.72,230, 

చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర   రూ.73,370గా ఉంది.

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,210 వద్ద ఉంది.

కోల్‌కతాలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.66,210 వద్ద ఉంది.

 హైదరాబాద్‌లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,210 వద్ద ఉంది.

ఢిల్లీలో   పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర   రూ.66,360,

బెంగళూరులో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.66,210, 

చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.67,260గా ఉంది.

ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.84,900గా ఉంది.

చెన్నై, హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.88,400గా ఉంది.

 0111 GMT నాటికి స్పాట్ గోల్డ్  0.6 శాతం పెరిగి ఔన్సుకు $2,386.38 వద్ద ఉంది. అంతకుముందు సెషన్‌లో బులియన్ 2,389.29 వద్ద రికార్డు స్థాయిని తాకింది. స్పాట్ సిల్వర్  ఔన్స్‌కు 0.7 శాతం పెరిగి 28.66 డాలర్లకు, ప్లాటినం 0.7 శాతం పెరిగి 986.80 డాలర్లకు, పల్లాడియం 0.6 శాతం పెరిగి 1,052.61 డాలర్లకు చేరుకుంది.

click me!