బంగారం, వెండి కొంటున్నారా.. నేడు హైదరాబాద్ లో తులం ధర పెరిగిందా తగ్గిందా తెలుసుకోండి..

Published : Mar 07, 2023, 09:55 AM IST
బంగారం, వెండి కొంటున్నారా.. నేడు హైదరాబాద్ లో తులం ధర పెరిగిందా తగ్గిందా తెలుసుకోండి..

సారాంశం

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు $1850 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ సిల్వర్ $21.10 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇంకా డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రూ.81.843 వద్ద ఉంది. 

ఈ రోజు  07 మార్చి 2023న దేశ రాజధాని ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, ముంబైలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. బడ్జెట్ తర్వాత బంగారం కొత్త గరిష్ట స్థాయి 58,660కి చేరుకుంది. నేడు ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,950, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 150 పెరుగుదలతో 56,700 వద్ద ఉంది.  

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ. 52,500, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,280. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 56,550 

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,850, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 56,550. భువనేశ్వర్‌లో  ఈ రోజు 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 56,550 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 51,850. గత 24 గంటల్లో ధరలు అలాగే ఉన్నాయి.

మరోవైపు ఈరోజు బంగారం ధరలు హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలలో స్థిరంగా ఉన్నాయి. ప్రముఖ నగరాల్లో  పసిడి ధరల ప్రకారం, బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 51,850, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,550. హైదరాబాద్‌లో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,850, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,550. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,850, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,550. విశాఖపట్నంలో బంగారం ధరలు  22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,850, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,550. మరోవైపు హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 70,600.

ఇదిలా ఉండగా వెండి ధరలు చూస్తే  కోల్‌కతా,  ముంబైలో రూ.66,900. చెన్నైలో వెండి ధర రూ. 70,600. ఇక్కడ పేర్కొన్న బంగారం,  వెండి ధరలు ఉదయం 8 గంటలకు చెందినవి అలాగే ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ కరెన్సీ ధరలలో మార్పు, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు అనేక ఇతర కారణాలు బంగారం ధరలో హెచ్చుతగ్గులకు కారణాలు అని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.  

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు $1850 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ సిల్వర్ $21.10 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇంకా డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రూ.81.843 వద్ద ఉంది. 

ఈ రోజు బంగారం ధర: MCXలో  ఎంతంటే ?
MCXలో ఏప్రిల్ ఫ్యూచర్స్  బంగారం 10 గ్రాములకు రూ. 55,920 వద్ద ట్రేడవుతోంది, ఈ రోజు 0.36 శాతం పెరిగింది. మరోవైపు, మే ఫ్యూచర్స్‌ వెండి కిలోగ్రాము ప్రాతిపదికన 0.62 శాతం పెరిగి రూ.64,800 వద్ద ట్రేడవుతోంది.

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా అనేది MCX పూర్తి రూపం. ఇది భారతదేశంలో వస్తువుల మార్పిడికి స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ.  

బంగారం రిటైల్ ధరలను తెలుసుకోవడానికి మీరు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు. ఈ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చిన కొద్దిసేపటికే, మీరు SMS ద్వారా రేట్లు పొందుతారు. 

బంగారం స్వచ్ఛతను ఇప్పుడే చెక్ చేయాలనుకుంటే.. దాని కోసం ప్రభుత్వం యాప్‌ను రూపొందించింది. కస్టమర్లు BIS కేర్ యాప్‌ని ఉపయోగించి బంగారం స్వచ్ఛతను చెక్ చేయవచ్చు. మీరు బంగారం స్వచ్ఛతను చెక్ చేయడమే కాకుండా, దాని గురించి ఫిర్యాదు చేయడానికి కూడా ఈ యాప్‌ని ఉపయోగించవచ్చు

PREV
click me!

Recommended Stories

NPS Scheme: ఆన్‌లైన్‌లో ఎన్‌పీఎస్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి.? ఏ డాక్యుమెంట్స్ కావాలి
Year End Sale : ఐఫోన్, మ్యాక్‌బుక్‌లపై భారీ డిస్కౌంట్లు.. విజయ్ సేల్స్ బంపర్ ఆఫర్లు!