Gold Rate: బంగారం ధర ఏకంగా రూ. 64 వేలు దాటుతుందని తెలిస్తే, మహిళలకు కన్నీళ్లు ఆగవేమో..

Published : Mar 21, 2023, 02:44 PM IST
Gold Rate: బంగారం ధర ఏకంగా రూ. 64 వేలు దాటుతుందని తెలిస్తే, మహిళలకు కన్నీళ్లు ఆగవేమో..

సారాంశం

బ్యాంకింగ్ సంక్షోభం, ఆర్థిక  మాంద్యం భయాలతో బంగారం తొలిసారి రూ. 60 వేలు దాటేసింది. ముఖ్యంగా బంగారం పెట్టుబడులు పెట్టేవారికి సురక్షితమైన స్వర్గధామంగా మారిపోయింది. త్వరలోనే బంగారం అది రూ. 64 వేల పరిధిని దాటవచ్చని అంచనా వేస్తున్నారు. 

బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. మంగళవారం కూడా బంగారం  ధరలు భారీగా పెరిగాయి. బ్యాంకింగ్ సంక్షోభం, ఆర్థిక  మాంద్యం భయాలతో బంగారం తొలిసారి రూ. 60 వేలు దాటేసింది. మంగళవారం కూడా బంగారం ధర దాదాపు రూ.1000 పెరిగి రూ.60455కి చేరింది. స్టాక్ మార్కెట్ల పతనం కారణంగా బంగారం ధరలకు కూడా మద్దతు లభించింది. బ్యాంకింగ్ సంక్షోభం తీవ్రతరం కావడం వల్ల, ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో క్షీణత కనిపిస్తోంది. అదే సమయంలో మాంద్యం భయం కూడా తీవ్రతరం కావడం ప్రారంభించింది. ఫలితంగా బంగారం పెట్టుబడులు పెట్టేవారికి సురక్షితమైన స్వర్గధామంగా మారిపోయింది. త్వరలోనే బంగారం అది రూ. 64 వేల పరిధిని దాటవచ్చని అంచనా వేస్తున్నారు. 

64 వేల వరకు బంగారం పెరగనుంది

బంగారం ధరలు పెరగడానికి బ్యాంకింగ్ సంక్షోభమే ప్రధాన కారణమని కేడియా కమోడిటీ డైరెక్టర్ అజయ్ కేడియా చెబుతున్నారు. UBS క్రెడిట్ సూయిస్ బ్యాంక్‌ను కొనుగోలు చేస్తుందనే చర్చ జరుగుతున్నప్పటికీ, ఇది బ్యాంకింగ్ సంక్షోభానికి తెరపడదని, మరోవైపు డాలర్ లో పతనం కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ల పతనం కారణంగా బంగారం ధరలకు మద్దతు లభించింది. ఫెడ్ రేట్ల పెంపుపై కూడా అనిశ్చితి నెలకొంది. దీంతో రానున్న రోజుల్లో 10 గ్రాముల బంగారం రూ.64,000 వరకు పెరగవచ్చనే వాదన వినిపిస్తోంది. 

రూ. 10 వేల నుంచి 60 వేల వరకూ బంగారం ప్రయాణం

మే 5, 2006: రూ. 10,000

నవంబర్ 6, 2010: రూ. 20,000

జూన్ 1, 2012: రూ. 30,000

జనవరి 3, 2020: రూ. 40,000

22 జూలై 2020: రూ. 50,000

మార్చి 20, 2023: రూ. 60,000

2020 సెప్టెంబర్‌లో 10 గ్రాములకు రూ. 58018 వద్ద ఆల్‌టైమ్ హైని నమోదు చేయగా, ఇప్పుడు రూ. 60 వేలు దాటింది. బంగారం ధరలలో అప్‌ట్రెండ్ కొనసాగుతోందని బ్రోకరేజ్ హౌస్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ తెలిపింది. మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో కూడా బంగారం ధరలు పెరుగుతున్నాయి. చారిత్రాత్మకంగా, గత 50 సంవత్సరాలలో బంగారం ధరలతో పోల్చితే, గత  4 నుండి 5 సంవత్సరాల నుంచి బంగారం ధర భారీగా పెరుగుతోంది. 

ఈ కారణాల వల్ల బంగారానికి మద్దతు లభిస్తోంది..

2022 క్యాలెండర్ సంవత్సరంలో అమెరికన్ సెంట్రల్ బ్యాంకులు 1136 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. ఇది ఏ క్యాలెండర్ సంవత్సరంలోనైనా అత్యధికం అనే చెప్పాలి. ఇటీవల, యుఎస్ డాలర్ పతనంతో పాటు  యుఎస్ బాండ్ ఈల్డ్ తగ్గటం వల్ల బంగారం ధరకు మద్దతు లభిస్తోంది. మరోవైపు, ఈక్విటీ మార్కెట్లలో అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా బంగారం డిమాండ్‌ను పెంచాయి.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

రూ. 1 కోటి టర్మ్ పాలసీ: మీ కుటుంబానికి సరైన ఆర్థిక భద్రత ఇదేనా?
Indian Railway: బ్యాట‌రీ వాహ‌నాలు, వీల్ చైర్‌లు.. రైల్వే స్టేష‌న్‌లో మీకు తెలియ‌ని ఎన్నో సౌక‌ర్యాలు