Gold Rate: మహిళలకు గుడ్ న్యూస్ బంగారం ధర త్వరలోనే రూ. 50 వేల దిగువకు పడిపోయే చాన్స్..కారణాలు తెలిస్తే షాక్..

By Krishna Adithya  |  First Published Jun 20, 2023, 3:28 PM IST

బంగారం ధరలు భారీగా పతనం అవుతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ గమనించినట్లయితే, ఒక ఔన్సు బంగారం ధర గడచిన నెల రోజుల్లో ఏకంగా 100 డాలర్లు తగ్గిపోయింది. దీంతో దేశీయంగా కూడా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి.


ఆషాడ మాసం మొదలైపోయింది. ఇక బంగారం ధర తగ్గుతుందని అంతా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టే అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్ల పై కూడా పడే అవకాశం ఉందని స్పష్టంగా కనిపిస్తుంది.  ముఖ్యంగా దేశీయ మార్కెట్లో ప్రస్తుతం 24 క్యారట్ల బంగారం ధర 59,500 రూపాయలుగా ఉంది. అయితే పెళ్లిళ్ల సీజన్ ముగియడంతో ఈ బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. దేశీయంగా ఈ కారణాలు ఉన్నప్పటికీ,  అంతర్జాతీయంగా మాత్రం బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. 

అమెరికా బులియన్ మార్కెట్లో గమనించినట్లయితే, ఒక ఔన్స్ (31 గ్రాములు) బంగారం ధర 1950 డాలర్లకు దిగువన ట్రేడవుతోంది. అయితే అంతర్జాతీయంగా డాలర్  మారకం బలపడటం వల్ల కూడా  బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయని అంతా అంచనా వేస్తున్నారు.  సాధారణంగా బంగారం ధరలు డాలర్ తో ముడిపడి ఉంటాయి. డాలర్ రేటు బలపడితే బంగారం ధర క్షీణిస్తుందని సాధారణంగా ఆర్థికవేత్తలు అంచనా వేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో గడచిన రెండు వారాలుగా గమనించినట్లయితే డాలర్ మారకం విలువ వరుసగా పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో పసిడి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

Latest Videos

ముఖ్యంగా అంతర్జాతీయంగా గమనించినట్లయితే, అమెరికన్ బాండ్ మార్కెట్లో పెట్టుబడులు పెరిగాయి. ఈ ప్రభావం కూడా బంగారం మార్కెట్ పై పడే అవకాశం ఉంది.  బంగారం ఫ్యూచర్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఎక్కువగా ఆసక్తి చూపటం లేదు. ఇది కూడా ఒకరకంగా పసిడి మార్కెట్ పడిపోవడానికి కారణమయ్యే అవకాశం కనిపిస్తోంది. 

మరోవైపు దేశంగా గమనించినట్లయితే పెళ్ళిలో సీజన్ ముగిసిపోయింది. ఆషాడమాసం వచ్చేసింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అలాగే దక్షిణ భారత దేశంలో పెళ్లిళ్ల సీజన్ దాదాపు అయిపోయినట్లే ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు కూడా భారీగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఫలితంగా దేశీయంగా బంగారు ధరలు తగ్గే వీలు కనిపిస్తోంది.  ఇదే కనుక జరిగితే దేశీయంగా బంగారం ధరలు 10 గ్రాములు గాను 24 క్యారెట్ల బంగారం ధర 55000 వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.  ఒకవేళ అంతర్జాతీయంగా కూడా ఇదే ట్రెండు కొనసాగినట్లయితే త్వరలోనే పసిడి ధర 50 వేల స్థాయికి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

అయితే అంతర్జాతీయంగా ప్రస్తుతం బంగారం ధరలు చాలా అస్థిరంగా ఉన్నాయి.  ముఖ్యంగా పశ్చిమ దేశాల్లో నెలకొన్నటువంటి ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఇంకా ముగిసిపోలేదు ఈ నేపథ్యంలో బంగారం ధరలు అస్థిరంగా కొనసాగుతున్నాయి.  గత నెలలో భారీగా పెరిగిన బంగారం ధర ఇప్పుడు తగ్గుముఖం పడుతోంది.  ఇదే పరిస్థితి కొనసాగితే పసిడి ధరలు దేశీయంగా మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

click me!