లాక్‌డౌన్ ఎఫ్ఫెక్ట్.. పడిపోతున్న పసిడి.. ఎగిసిన వెండి ధరలు.. ఈ రోజు 10 గ్రాముల ధర ఎంతంటే..?

Published : Nov 29, 2022, 10:42 AM ISTUpdated : Nov 29, 2022, 10:44 AM IST
లాక్‌డౌన్  ఎఫ్ఫెక్ట్.. పడిపోతున్న పసిడి.. ఎగిసిన వెండి ధరలు.. ఈ రోజు 10 గ్రాముల ధర ఎంతంటే..?

సారాంశం

నేడు హైదరాబాద్ లో 22-క్యారెట్ బంగారం ధర రూ.48,250,  24-క్యారెట్ బంగారం ధర  రూ. 52,980. మరోవైపు  కిలో ధర రూ.68,100గా ట్రేడవుతోంది. స్పాట్ వెండి 0.9 శాతం పెరిగి $21.10డాలర్లకి చేరుకుంది.

నేడు మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో బంగారం ధరలు మారలేదు, వెండి ధరలు మాత్రం కిలోకు రూ.400 తగ్గింది. ఈరోజు 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.52,980గా ఉండగా, వెండి కిలో ధర రూ.61,400గా ఉంది. ఒక నివేదిక  ప్రకారం ఈరోజు పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.48,560 వద్ద ట్రేడవుతోంది.

ముంబై, కోల్‌కతా అండ్ హైదరాబాద్‌లలో పది గ్రాముల బంగారం 24 క్యారెట్ల ధర రూ. 52,980, 10 గ్రాముయాల 22 క్యారెట్ల ధర రూ. 48,560 వద్ద ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల  బంగారం ధర రూ. 53,140, 22 క్యారెట్ల ధర రూ. 48,710 వద్ద ట్రేడవుతోంది. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,970, 22 క్యారెట్ల ధర రూ.49,470గా ఉంది.

చైనాలో కోవిడ్ కేసులు మళ్ళీ పెరుగుతుండటంతో  అక్కడి ప్రభుత్వం కఠిన నిబంధనలు  అలాగే కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌  విధిస్తుంచింది. దీంతో ఆర్థిక వృద్ధి నెమ్మదిస్తుందనే ఆందోళనలు ఎక్కువయ్యాయి.

నేడు హైదరాబాద్ లో 22-క్యారెట్ బంగారం ధర రూ.48,250,  24-క్యారెట్ బంగారం ధర  రూ. 52,980

0251 GMT నాటికి స్పాట్ బంగారం 0.3 శాతం పెరిగి ఔన్స్‌కు $1,745.22కి చేరుకుంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం పెరిగి $1,745.40కి చేరుకుంది.

ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.61,400. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలో కిలో ధర రూ.68,100గా ట్రేడవుతోంది. స్పాట్ వెండి 0.9 శాతం పెరిగి $21.10డాలర్లకి చేరుకుంది.

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ.81.71 వద్ద కొనసాగుతోంది.

కరెన్సీ మారకం రేటు, ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర పన్నులు, నగల వ్యాపారుల మేకింగ్ ఛార్జీల కారణంగా అన్ని రాష్ట్రాల్లో బంగారం ధరలు ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. 

PREV
click me!

Recommended Stories

New Labour Codes : కొత్త లేబర్ కోడ్స్ తో మీ జీతం తగ్గుతుందా? కేంద్రం చెప్పిందేంటో తెలుసా!
Post office: నెల‌కు రూ. 5 వేలు ప‌క్క‌న పెడితే.. రూ. 8.5 ల‌క్ష‌లు సొంతం చేసుకోవ‌చ్చు