బంగారం కంటే వెండి యమ కాస్ట్లీ.. 9 రోజుల్లో రూ.12560 పెంపు..

By Sandra Ashok KumarFirst Published Jul 29, 2020, 12:30 PM IST
Highlights

ఎం‌సి‌ఎక్స్ లో ఆగస్టు గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.1% పడిపోయి, తులం ధర రూ.52,540 కు చేరుకుంది. ఎంసిఎక్స్ సిల్వర్ ఫ్యూచర్స్ కిలో వెండి ధర 0.18% పెరిగి, రూ.65,123కు చేరుకుంది. 

బంగారం ధరలు రోజు రోజుకి పెరుగుతుంటే పసిడితో పాటు వెండి ధరలు కూడా కొండెక్కుతున్నాయి. భారతదేశంలో బంగారం ధరలు ఈ రోజు కాస్త తక్కువగా ఉన్నాయి. ఎం‌సి‌ఎక్స్ లో ఆగస్టు గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.1% పడిపోయి, తులం ధర రూ.52,540 కు చేరుకుంది.

ఎంసిఎక్స్ సిల్వర్ ఫ్యూచర్స్ కిలో వెండి ధర 0.18% పెరిగి, రూ.65,123కు చేరుకుంది. మునుపటి సెషన్ లో బంగారం 1% లేదా రూ.550 పెరిగింది.

అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో పాటు, కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌తో కుదేలైన ఆర్థిక వ్యవస్థను కుదుటపరిచేందుకు ఆయా సెం‍ట్రల్‌ బ్యాంక్‌ వడ్డీరేట్లను తగ్గించడం కూడా బం‍గారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

గ్లోబల్ మార్కెట్లలో స్పాట్ బంగారం ఔన్స్‌కు  రూ.1,957.84 చేరింది. ఇతర విలువైన లోహాలలో వెండి ఔన్స్‌కు 1.1% పడిపోయి 24.31 డాలర్లకు చేరుకోగా, పల్లాడియం 1.1% పడిపోయి 2,259.52 డాలర్లకు చేరుకుంది.

also read 

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల ప్రభావం మరింత ఉద్దీపన చర్యల నుండి ద్రవ్యోల్బణం అంచనాలు బంగారానికి మద్దతు ఇచ్చాయి. జూలైలో యు.ఎస్ వినియోగదారుల విశ్వాసం ఊహించిన దానికంటే ఎక్కువ పడిపోయిందని మంగళవారం డేటా చూపించింది.

బంగారంపై పెట్టుబడి డిమాండ్ బలంగా ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద గోల్డ్ -సపోర్ట్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్ లేదా గోల్డ్ ఇటిఎఫ్ హోల్డింగ్స్ ఎస్‌పిడిఆర్ గోల్డ్ ట్రస్ట్ 0.7% పెరిగి 1,243.12 టన్నులకు చేరుకుంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో 100 రోజులు మాత్రమే ఉండటంతో, యుఎస్ కాంగ్రెస్‌లో డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య చర్చలు ఉద్రిక్తంగా ఉన్నాయి.
 

click me!