వెండికి రెక్కలు..భారీగా పెరిగిన ధర

Published : Jan 04, 2019, 04:30 PM IST
వెండికి రెక్కలు..భారీగా పెరిగిన ధర

సారాంశం

వెండి ధర భారీగా పెరిగింది. గత నాలుగు రోజులుగా పెరుగుతూ వస్తున్న వెండి ధర ఈ రోజు కూడా పెరిగింది. 

వెండి ధర భారీగా పెరిగింది. గత నాలుగు రోజులుగా పెరుగుతూ వస్తున్న వెండి ధర ఈ రోజు కూడా పెరిగింది. నేటి బులియన్ మార్కెట్లో రూ.440 పెరిగి కేజీ వెండి ధర రూ.40వేల మార్క్ ని చేరింది.  కేజీ వెండి ధర రూ.40,140కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీ దారుల నుంచి డిమాండ్  పెరగడంతో.. వెండి ధర అమాంతం పెరిగినట్లు ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఇదిలా ఉండగా.. పసిడి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది.  డాలర్ తో రూపాయి బలపడటం, స్థానికంగా కొనుగోళ్లు తగ్గిపోవడంతో బంగారం దిగి వచ్చింది. నేటి బులియన్ మార్కెట్లో  రూ.145 తగ్గి పది గ్రాముల బంగారం ధర రూ.32,690కి చేరింది. గడిచిన  మూడు రోజుల్లో బంగారం ధర రూ.565 పెరగగా.. నేడు మాత్రం స్వల్పంగా తగ్గింది. 
 

PREV
click me!

Recommended Stories

Indian Economy: వామ్మో..డబ్బు తయారీకే ఇంత ఖర్చా, RBI షాకింగ్ లెక్కలు.
8th Pay Commission DA Hike: 63 శాతానికి డీఏ.. కేంద్రం అదిరిపోయే న్యూస్ ! జీతాలు ఎంత పెరుగుతాయంటే?