అంబానీని జైల్లో పెట్టండి.. సుప్రీంకోర్టులో స్వీడన్ సంస్థ పిటిషన్

By sivanagaprasad kodatiFirst Published Jan 4, 2019, 1:30 PM IST
Highlights

ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ కమ్యూనికేషన్‌ ఛైర్మన్ అనిల్ అంబానీకి  మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనను నిర్బంధించాలని కోరుతూ స్వీడన్‌కు చెందిన ప్రఖ్యాత టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 

ఎరిక్సన్ సంస్థకు అనిల్ అంబానీ రూ.550 కోట్ల బాకీని చెల్లించాల్సి వుంది. త్వరలోనే చెల్లింపులు చేస్తానని గతంలోనే ఆయన కోర్టుకు హామీ ఇచ్చారు. అయితే కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడంతో ఎరిక్సన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

అంబానీని జైలుకు పంపి, విదేశాలకు పారిపోకుండా అడ్డుకోవాలని, తద్వారా తమ బాకీని వడ్డీతో సహా చెల్లించేలా చూడాలంటూ రెండవసారి పిటిషన్ దాఖలు చేసింది. అలాగే ఈ రిలయన్స్ టెలికాం, రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్ లిమిటెడ్ కంపెనీలకు చెందిన అధికారులు భారత్ విడిచి వెళ్లకుండా నిరోధించేలా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ద్వార చర్యలు చేపట్టాలని పిటిషన్‌లో కోరింది. 
 
click me!