స్థిరంగా బంగారం, ఎగిసిన వెండి.. నేడు హైదరాబాద్ లో 10గ్రాముల ధర ఎంతో తెలుసుకొండి..?

By asianet news teluguFirst Published Dec 9, 2022, 10:12 AM IST
Highlights

నేడు శుక్రవారం ట్రేడింగ్‌లో బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఒక వెబ్‌సైట్ ప్రకారం, పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,000, 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,500 వద్ద ట్రేడవుతోంది. 

గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరల్లో ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. నిన్న కూడా బంగారం ధర ఎక్కువగానే కనిపించగా, నేడు బంగారం ధర నిలకడగా ఉండడంతో వెండి  ధర మాత్రం ఎగిసింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

నేడు శుక్రవారం ట్రేడింగ్‌లో బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఒక వెబ్‌సైట్ ప్రకారం, పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,000, 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,500 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు వెండి ధర ఈరోజు కిలోకు రూ.700 పెరిగి రూ.65,500కి చేరుకుంది.

ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, కేరళ, పుణెలలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర  రూ. 54,000, 22 క్యారెట్ల ధర 49,500 వద్ద ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల  బంగారం ధర రూ. 54,150, 22 క్యారెట్ల ధర రూ. 49,650 వద్ద ట్రేడవుతోంది. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,790, 22 క్యారెట్ల ధర రూ.50,230గా ఉంది.

0241 GMT నాటికి స్పాట్ బంగారం 0.2 శాతం పెరిగి ఔన్సుకు $1,793.16 డాలర్ల వద్ద ఉంది, అయితే ఈ వారంలో ఇప్పటివరకు 0.3 శాతం పడిపోయింది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.2 శాతం పెరిగి $1,804.80డాలర్లకి చేరుకుంది.

ఢిల్లీ, ముంబైలలో కిలో వెండి ధర రూ.65,500గా ఉంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలో కిలో వెండి ధర రూ.71,300గా ఉంది.

USలో స్పాట్ సిల్వర్ 0.6% పెరిగి $23.20 డాలర్లకి, ప్లాటినం 0.4% పెరిగి $1,006.91డాలర్లకి చేరుకుంది. పల్లాడియం 0.4% నష్టపోయి $1,918.50డాలర్లకి చేరుకుంది.

బంగారం స్వచ్ఛత తెలుసుకోవడం ఎలా?

బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) ద్వారా హాల్ మార్కులు ఇస్తారు. 24 క్యారెట్లపై 999, 23 క్యారెట్లపై 958, 22 క్యారెట్లపై 916, 21 క్యారెట్లపై 875, 18 క్యారెట్లపై 750. చాలా వరకు బంగారాన్ని 22 క్యారెట్లలో విక్రయిస్తుండగా, కొందరు 18 క్యారెట్లను కూడా ఉపయోగిస్తున్నారు. క్యారెట్ ఎంత ఎక్కువ ఉంటే బంగారం అంత స్వచ్ఛంగా ఉంటుందని చెబుతారు.

22 అండ్ 24 క్యారెట్ల మధ్య తేడా ఏమిటి?
24 క్యారెట్ల బంగారం 99.9% స్వచ్ఛమైనది, 22 క్యారెట్ దాదాపు 91% స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారానికి 9% రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలతో కలిపి ఆభరణాలు తయారు చేస్తారు. 24 క్యారెట్ల బంగారం మృదువైనది అయినప్పటికీ, దానితో ఆభరణాలుగా  తయారు చేయడం సాధ్యం కాదు.

click me!