పెట్రోల్, డీజిల్‌పై వాహనదారులకు రిలీఫ్.. భారీగా పడిపోతున్న క్రూడాయిల్.. నేడు లీటరుకి ఎంతంటే ?

By asianet news teluguFirst Published Dec 9, 2022, 8:56 AM IST
Highlights

అంతర్జాతీయ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా క్రూడాయిల్ ధర తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం, WTI క్రూడ్ ధర బ్యారెల్‌కు $78 డాలర్ల వద్ద , బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు దాదాపు $ 83 డాలర్ల వద్ద  ఉంది.
 

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరల పతనం కొనసాగుతున్న నేపథ్యంలో భారతీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను విడుదల చేశాయి.

ఆయిల్ కంపెనీలు శుక్రవారం అంటే 9 డిసెంబర్ 2022న పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా కొనసాగించినప్పటికి  వరుసగా 199వ రోజు ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు లేదు.

అంతర్జాతీయ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా క్రూడాయిల్ ధర తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం, WTI క్రూడ్ ధర బ్యారెల్‌కు $78 డాలర్ల వద్ద , బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు దాదాపు $ 83 డాలర్ల వద్ద  ఉంది.

ఆరున్నర నెలల నుంచి 
పెట్రోలు, డీజిల్ ధరలు ఆరున్నర నెలలకు పైగా ఒకే స్థాయిలో ఉండడం ఇదే తొలిసారి. మే 2022లో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఎక్సైజ్‌ సుంకం తగ్గింపు కారణంగా దేశవ్యాప్తంగా ఒక్కసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా తగ్గాయి. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.8, డీజిల్ రూ.6 తగ్గింది. దీని తరువాత, కొన్ని రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించడం ద్వారా కూడా ప్రజలకు ఉపశమనం లభించింది.

ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.72కు విక్రయిస్తుండగా, డీజిల్ రూ.89.62గా ఉంది. ముంబైలో లీటరు పెట్రోల్ రూ.106.31, డీజిల్ రూ.94.27గా ఉంది. కోల్‌కతాలో పెట్రోలు ధర రూ.106.03గా ఉండగా, డీజిల్ లీటరుకు రూ.92.76గా ఉంది. మరోవైపు చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.102.63, డీజిల్ రూ.94.24గా విక్రయిస్తున్నారు.

రాజస్థాన్‌లోని  గంగానగర్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.113.48, డీజిల్‌ ధర రూ.98.24. హనుమాన్‌గఢ్‌ జిల్లాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.112.54కు, డీజిల్‌ ధర రూ.97.39గా ఉంది.

పోర్ట్ బ్లెయిర్‌లో  లీటర్ పెట్రోల్ ధర రూ.84.10, డీజిల్ ధర రూ.79.74గా ఉంది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82.

నోయిడా: లీటర్ పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.96.

జైపూర్: లీటర్ పెట్రోల్ ధర రూ.108.48, డీజిల్ ధర రూ.93.72.

పాట్నా: లీటర్ పెట్రోల్ ధర రూ.107.24, డీజిల్ ధర రూ.94.04

 పెట్రోల్,  డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్ ఇతర జోడించిన తర్వాత, దాని ధర దాదాపు రెట్టింపు అవుతుంది. విదేశీ మారకపు ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలను బట్టి పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజూ సమీక్షిస్తుంటారు.

click me!