పెరిగిన బంగారం ధరలు... రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం..

By Sandra Ashok KumarFirst Published Jun 19, 2020, 1:01 PM IST
Highlights

ఎం‌సి‌ఎక్స్ మార్కెట్‌లో ఈ రోజు బంగారం ధరలు 10 గ్రాములకు, 47,350 వద్ద వద్ద ట్రేడ్‌ అవుతోంది. అయితే వెండి రేట్లు మాత్రం తక్కువగా ట్రేడ్ అవుతున్నాయి. ఎం‌సి‌ఎక్స్ మార్కెట్‌లో వెండి ధరలు 0.15% పడిపోయి కిలోకు 47,790 కు చేరుకుంది. నిన్నటి రోజున ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగిసే సరికి 10గ్రామలు బంగారం ధర రూ.17ల స్వల్ప లాభంతో రూ.47,355 వద్ద స్థిరపడింది. 
 

భారతదేశంలో బంగారం ధరలు ఈ రోజు స్థిరంగా ఉన్నాయి, విలువైన లోహలు వరుసగా మూడవ రోజు కూడా కాస్త లాభాలతో ఉంది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో 10గ్రాముల బంగారం ధర రూ.63 లాభంతో రూ. 47,418 ఉంది.

ఎం‌సి‌ఎక్స్ మార్కెట్‌లో ఈ రోజు బంగారం ధరలు 10 గ్రాములకు, 47,350 వద్ద వద్ద ట్రేడ్‌ అవుతోంది. అయితే వెండి రేట్లు మాత్రం తక్కువగా ట్రేడ్ అవుతున్నాయి. ఎం‌సి‌ఎక్స్ మార్కెట్‌లో వెండి ధరలు 0.15% పడిపోయి కిలోకు 47,790 కు చేరుకుంది. నిన్నటి రోజున ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగిసే సరికి 10గ్రామలు బంగారం ధర రూ.17ల స్వల్ప లాభంతో రూ.47,355 వద్ద స్థిరపడింది. 

గ్లోబల్ మార్కెట్లలో బంగారం ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ల భయాలు, యుఎస్-చైనా మధ్య ఉద్రిక్తతలు  తదితర అంశాలను పరిగణలోకి తీసుకోని రానున్న రోజుల్లో బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు.

also read చైనా గూడ్స్ నిషేధం సరే: కానీ.. మా డిమాండ్ల సంగతేంటి..

వెండి 0.7% పడిపోయి 17.38 డాలర్లకు చేరుకోగా, ప్లాటినం 0.1% పెరిగి 805.34 డాలర్లకు చేరుకుంది. "కరోనావైరస్ మహమ్మారి భయాలు, పెరుగుతున్న ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారం డిమాండుకు మద్దతునిస్తూనే ఉన్నాయి" అని జియోజిత్‌లోని హెడ్ కమోడిటీ రీసెర్చ్ హరీష్ వి అన్నారు.

అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారానికి కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఆసియాలో నేటి ఉదయం ట్రేడింగ్‌లో ఔన్స్‌ బంగారం 5డాలర్లు పెరిగి 1,735 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

యుఎస్ రాష్ట్రాల్లో అనేక కొత్త కేసుల పెరుగుదల, బీజింగ్‌లో ప్రయాణలపై పరిమితులు విధించడం ఆర్థిక కార్యకలాపాలను తిరిగి తెరవడం వల్ల కలిగే నష్టాలను గుర్తు చేస్తున్నాయి. డాలర్ సూచీ 0.1% పెరిగి మునుపటి సెషన్‌లో రెండు వారాల గరిష్ట స్థాయికి చేరుకుంది. 

ప్రముఖ అమెరికా ప్రభుత్వ నిపుణుడు ఆంథోనీ ఫౌసీ మాట్లాడుతూ త్వరలోనే కరోనావైరస్ వ్యాక్సిన్ వస్తుందని, ఇది కోవిడ్-19 మహమ్మారిని అంతం చేస్తుందని, కొన్ని వాక్సిన్ ట్రయల్స్ ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని పేర్కొంది. హైదరబాద్ లో నేడు 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.49,170.
 

click me!