భారీగా తగ్గిన బంగారం ధర.. వరసగా మూడో రోజు

Published : Sep 28, 2018, 04:32 PM IST
భారీగా తగ్గిన బంగారం ధర.. వరసగా మూడో రోజు

సారాంశం

అంతర్జీతీయ మార్కెట్ల ప్రభావంతో బంగారం ధర రోజు రోజుకీ తగ్గుతూ వస్తున్నట్లు బులియన్ ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

బంగారం ధర వరసగా మూడో రోజు తగ్గుముఖం పట్టింది. అంతర్జీతీయ మార్కెట్ల ప్రభావంతో బంగారం ధర రోజు రోజుకీ తగ్గుతూ వస్తున్నట్లు బులియన్ ట్రేడ్ వర్గాలు తెలిపాయి. శుక్రవారం నాటి మార్కెట్ లో రూ.250 తగ్గడంతో పది గ్రాముల బంగారం ధర రూ.31,300కి చేరింది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు, యూఎస్‌ ఫెడ్‌ సమావేశం, డాలరు పడిపోవడం బంగారం ధర తగ్గుదలపై తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో పాటు స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్‌ లేకపోవడం ఇందుకు మరో కారణం. గత రెండు రోజుల్లో బంగారం ధర రూ.175 తగ్గింది.

పసిడి బాటలోనే వెండి కూడా పయనించింది. వెండి భారీగా తగ్గి రూ.38వేల మార్క్‌కు చేరుకుంది. రూ.450 తగ్గడంతో కిలో వెండి రూ.38,000గా ఉంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల దగ్గర నుంచి ఆశించిన స్థాయిలో డిమాండ్‌ రాకపోవడంతో వెండి ధర భారీగా తగ్గింది. నిన్న వెండి ధర రూ.300 తగ్గింది. ఇక అంతర్జాతీయంగానూ బంగారం ధర పడిపోయింది. బంగారం ధర 0.98శాతం తగ్గడంతో ఔన్సు 1,182.40 డాలర్లు పలికింది.

దేశరాజధాని ఢిల్లీలో 99.9శాతం స్వచ్ఛతగల బంగారం ధర రూ.31,300గా ఉండగా. 99.5శాతం స్వచ్ఛతగల బంగారం ధర రూ. 31, 150గా ఉంది. 

PREV
click me!

Recommended Stories

BSNL New Year Plan : జియో, ఎయిర్‌టెల్ కు బిగ్ షాక్ ! బీఎస్ఎన్ఎల్ న్యూ ఇయర్ 2026 సూపర్ ప్లాన్
Gold Prices: బంగారం ఎఫెక్ట్.. పెళ్లి ఖర్చు రెట్టింపు అయిపోయింది, చెబుతున్న సర్వే