అపోలో టైర్స్ ఎండీగా నీరజ్ నియామకానికి వాటాదారులు నో

Published : Sep 28, 2018, 12:17 PM IST
అపోలో టైర్స్ ఎండీగా నీరజ్ నియామకానికి వాటాదారులు నో

సారాంశం

అపొలో టైర్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా నీరజ్ కన్వర్ పున: నియామకాన్ని మైనారిటీ వాటాదారులు వ్యతిరేకించారు. సంస్థ లాభాలు రెండేళ్లుగా క్రమంగా తగ్గడమే కారణం.

ముంబై: ప్రముఖ టైర్ల తయారీ సంస్థ ‘అపొలో టైర్స్’ మైనారిటీ వాటాదారులు ఎదురు తిరిగారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా నీరజ్ కన్వర్ పున: నియామకాన్ని తిరస్కరించారు. దీంతో మెజారిటీ వాటా గల ప్రమోటర్లకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. నీరజ్ కుమార్ కన్వర్ ఆటో టైర్స్ సంస్థ వైస్ చైర్మన్‌గా ఉన్నారు. టైర్ల తయారీలో భారతదేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. 

తాజా పరిణామంపై వచ్చే బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నది అపోలో టైర్స్ డైరెక్టర్ల బోర్డు. తమ ధ్రుడ నిశ్చయానికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్న అపోలో టైర్స్ తమ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నది. ఉద్యోగులు, వినియోగదారులు, వాటాదారులు, భాగస్వాములు తదితర సంబంధిత వర్గాల అభిమతాన్ని పరిగణనలోకి తీసుకుంటామని ఒక ప్రకటనలో తెలిపింది అపొలో టైర్స్. 

అధిక నష్ట పరిహారం ఇవ్వాల్సి ఉన్నందునే నీరజ్ కన్వర్‌కు వ్యతిరేకంగా కొందరు భారతీయ సంస్థాగత ఇన్వెస్టర్లు, మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఓటేశాయి. సంస్థలో యాజమాన్య పద్ధతుల నిర్వహణ కోసం కన్వర్‌కు భారీగా పరిహారం చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. గతేడాది కన్వర్‌కు రూ.42.8 కోట్లు, 2016లో రూ.30 కోట్ల పరిహారం అందుకున్నారు నీరజ్ కన్వర్.

గతేడాది అపోలో టైర్స్ వార్షిక స్టాండ్ ఎలోన్ నికర లాభం రూ.622.4 కోట్లు. అంతకుముందేడాదితో పోలిస్తే 23 శాతం తక్కువ. నికర లాభం రూ.724 కోట్ల నుంచి 34 శాతం తగ్గింది. సంస్థ చరిత్రలో లాభాలు తగ్గుముఖం పట్టడం ఇదే మొదటి సారి కావడంతో అపొలో టైర్స్ వాటాదారుల్లో ఆందోళన మొదలైందని ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అడ్వైజరీ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ టాండన్ వ్యాఖ్యానించారు. సంస్థ మేనేజ్ చేసుకోవడం వాటాదారుల హక్కు అని చెప్పారు. వాటాదారుల అభిప్రాయాలను బహిరంగంగా తెలుసుకోవడానికి ప్రమోటర్లు ప్రయత్నించాలన్నదే తమ సంకేతమని టాండన్ తెలిపారు. 

స్థానిక, విదేశీ సంస్థాగత వాటాదారులతోపాటు మైనారిటీ వాటాదారులు సంస్థ మేనేజ్మెంట్ చేసే ప్రతి తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేయడం అనుచితం అని, సంస్థ ప్రయోజనాలకు వ్యతిరేకమని సంస్థ మేనేజ్మెంట్, ప్రమోటర్ల ప్రణాళికలకు నష్టం చేకూరుతుందని ఆర్థికవేత్తలు, పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
గత జూలైలో అంతర్జాతీయంగా బ్యాంకింగ్ రంగంలో అత్యంత హై ప్రొఫైల్ గల హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్‌గా దీపక్ పరేఖ్ నియామకాన్ని వాటాదారులు వ్యతిరేకించారు. 
 

PREV
click me!

Recommended Stories

BSNL New Year Plan : జియో, ఎయిర్‌టెల్ కు బిగ్ షాక్ ! బీఎస్ఎన్ఎల్ న్యూ ఇయర్ 2026 సూపర్ ప్లాన్
Gold Prices: బంగారం ఎఫెక్ట్.. పెళ్లి ఖర్చు రెట్టింపు అయిపోయింది, చెబుతున్న సర్వే