మళ్లీ తగ్గిన బంగారం.. ఎగిసిన వెండి.. నిన్నటితో పోల్చితే నేడు 10గ్రాముల ధర ఎంతంటే..?

By asianet news teluguFirst Published Sep 22, 2022, 9:42 AM IST
Highlights

ఒక గ్రాము 24 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 5,013 నుండి నేడు రూ.4,996 తగ్గింది. నిన్న రూ.57.20గా ఉన్న ఒక గ్రాము వెండి ధర నేడు రూ.57.40కి పెరిగింది. 

న్యూఢిల్లీ:  బంగారం ధరలు గురువారం ఒక్కసారిగా తగ్గగా, వెండి ధరలు మాత్రం పెరిగాయి. ఈ రోజు ఒక గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ. 4,595 నుండి రూ. 4,580కి చేరింది. ఒక గ్రాము 24 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 5,013 నుండి నేడు రూ.4,996 తగ్గింది. నిన్న రూ.57.20గా ఉన్న ఒక గ్రాము వెండి ధర నేడు రూ.57.40కి పెరిగింది. 

యూ‌ఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరో 75 బేసిస్ పాయింట్ల పెంపుతో పాటు మరింత పెంపును ఫ్లాగ్ చేయడంతో డాలర్ భారీగా పెరిగింది దీంతో బంగారం ధరలు గురువారం 1% తగ్గాయి. 0114 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు 1% తగ్గి $1,656.97కి పడిపోయింది . యూ‌ఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.5% తగ్గి $1,667.30కి చేరుకున్నాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ బ్యాక్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ SPDR గోల్డ్ ట్రస్ట్ హోల్డింగ్స్ మంగళవారం 953.32 టన్నుల నుండి బుధవారం 0.12% తగ్గి 952.16 టన్నులకు పడిపోయింది. స్పాట్ వెండి ఔన్స్‌కు 1.7% తగ్గి $19.26కి, ప్లాటినం 1.1% తగ్గి $897.92కి, పల్లాడియం 0.8% తగ్గి $2,138.51 వద్దకు చేరుకుంది.

 10 గ్రాముల బంగారం ధరలు
నగరాలు     22-క్యారెట్      24-క్యారెట్
చెన్నై         రూ.46,500    రూ.50,730
ముంబై       రూ.45,800    రూ.49,960
ఢిల్లీ            రూ.45,950    రూ.50,110
కోల్‌కతా     రూ.45,800    రూ.49,960
బెంగళూరు    రూ.45,850    రూ.50,040
హైదరాబాద్   రూ.45,800    రూ.49,960
నాసిక్    రూ.45,830    రూ.49,990
పూణే     రూ.45,830    రూ.49,990
లక్నో    రూ.45,950    రూ.50,110
చండీగఢ్    రూ.45,950    రూ.50,110
సూరత్       రూ.45,850    రూ.50,040
విశాఖపట్నం  రూ.45,800    రూ.49,960

ఇక్కడ చూపిన ధరలు స్థానిక ధరల కంటే భిన్నంగా ఉండవచ్చు. పైన పేర్కొన్న ధరల లిస్ట్ ఇండియాలోని వివిధ నగరాల్లో ప్రతి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం, 24-క్యారెట్ల బంగారం ధరలకు సంబంధించినవి. 

 వెండి ధరలు 

నగరాలు    10 గ్రాములు    100 గ్రాములు
చెన్నై           రూ.622          రూ.6,220
ముంబై         రూ.574    రూ.5,740
ఢిల్లీ              రూ.574    రూ.5,740
కోల్‌కతా         రూ.574    రూ.5,740
బెంగళూరు    రూ.622    రూ.6,220
హైదరాబాద్   రూ.622    రూ.6,220
నాసిక్            రూ.574    రూ.5,740
పూణే             రూ.574    రూ.5,740
లక్నో             రూ.574    రూ.5,740
చండీగఢ్       రూ.574    రూ.5,740
సూరత్          రూ.574    రూ.5,740
విశాఖపట్నం   రూ.622    రూ.6,220
భువనేశ్వర్    రూ.622    రూ.6,220
మైసూర్         రూ.622    రూ.6,220

click me!