ఇంధన ధరల అప్ డేట్.. పెట్రోల్ ధర రూ.84, డీజిల్ రూ.79 మాత్రమే; కొత్త ధరలు తెలుసుకోండి..

By asianet news teluguFirst Published Sep 22, 2022, 9:03 AM IST
Highlights

ఇండియాలోని ప్రముఖ నగరాల్లో కూడా పెట్రోల్-డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ముంబైలో పెట్రోల్ రూ.106.31కి లభిస్తుండగా, డీజిల్ రూ.94.27కి లభిస్తోంది. చెన్నై గురించి చెప్పాలంటే ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.102.63గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో కొనసాగుతున్న అస్థిరత మధ్య గురువారం పెట్రోల్-డీజిల్ ధరలు అప్‌డేట్ చేయబడ్డాయి. నేటికీ ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దీంతో గురువారం కూడా వాహనదారులకు కాస్త ఊరట లభించింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.72, డీజిల్ రూ.89.62 చొప్పున విక్రయిస్తున్నారు.

మరోవైపు ఇండియాలోని ప్రముఖ నగరాల్లో కూడా పెట్రోల్-డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ముంబైలో పెట్రోల్ రూ.106.31కి లభిస్తుండగా, డీజిల్ రూ.94.27కి లభిస్తోంది. చెన్నై గురించి చెప్పాలంటే ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.102.63గా ఉంది. డీజిల్ ధర రూ.94.24గా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ. 106.03, డీజిల్ ధర లీటరు రూ. 92.76.

ఇండియాలో అత్యంత చౌకైగా పెట్రోల్ - డీజిల్ పోర్ట్ బ్లెయిర్‌లో లభిస్తుంది. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.84.10 కాగా, డీజిల్ ధర రూ.79.74. ఢిల్లీ పక్కనే ఉన్న నోయిడాలో పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.96. గురుగ్రామ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.97.18గా ఉండగా, డీజిల్ ధర రూ.90.05గా ఉంది. హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.109.66, డీజిల్‌ ధర రూ.97.82

 క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 90 డాలర్ల దిగువకు పడిపోయింది. గురువారం ఉదయం WTI క్రూడ్ ధర బ్యారెల్‌కు 82.68 డాలర్లకు చేరుకుంది. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 89.55 డాలర్లుగా ఉంది.

పెట్రోల్-డీజిల్ ధరల సవరణ 
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర ఆధారంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతిరోజూ ఇంధన ధరలను సమీక్షించిన తర్వాత ధరలను నిర్ణయిస్తాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం వివిధ నగరాలలో పెట్రోల్ - డీజిల్ ధరల సమాచారాన్ని అప్‌డేట్ చేస్తాయి.

రాష్ట్ర స్థాయిలో పెట్రోల్‌పై విధించే పన్ను కారణంగా వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా వేర్వేరుగా ఉంటాయి.  

click me!