పసిడి ప్రియులకు షాకిస్తున్న బంగారం ధరలు.. నేడు కొనేముందు ఎంత పెరిగిందో తెలుసుకొండి...

Published : Nov 18, 2022, 10:12 AM ISTUpdated : Nov 18, 2022, 10:15 AM IST
పసిడి ప్రియులకు షాకిస్తున్న బంగారం ధరలు.. నేడు కొనేముందు ఎంత పెరిగిందో తెలుసుకొండి...

సారాంశం

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.48,750గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 53,180. పూణెలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.48,780గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,210గా ఉంది.

ప్రపంచవ్యాప్తంగా నేడు బంగారం-వెండి ధరలో హెచ్చుతగ్గులు స్థిరంగా ఉన్నాయి. అయితే భారత మార్కెట్‌లో మరోసారి బంగారం ధర పెరుగుదల నమోదైంది. దీని ప్రభావం బీహార్‌లో అధికంగా కనిపిస్తుంది. బీహార్‌లో బంగారం ధర భారీగా పెరగగా, పాట్నాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.750 పెరిగింది. నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 48,780గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.820 పెరిగి రూ.53,210గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.48,750గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 53,180. పూణెలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.48,780గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,210గా ఉంది. నాగ్‌పూర్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,780, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  53,210. నాసిక్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,780 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకి రూ.53,210గా ఉంది. నేటి వెండి ధర 10 గ్రాములకి రూ.620.

ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర పన్నులు, మేకింగ్ ఛార్జీల కారణంగా భారతదేశం అంతటా బంగారు ఆభరణాల ధరలు మారుతూ ఉంటాయి.

బంగారం స్వచ్ఛతను ఎలా చెక్ చేయాలి?
బంగారం స్వచ్ఛతను చెక్ చేసేందుకు ప్రభుత్వం ఒక యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ పేరు 'బిఐఎస్ కేర్ యాప్' దీని ద్వారా కస్టమర్లు బంగారం స్వచ్ఛతను చెక్ చేసుకోవచ్చు. అలాగే ఈ యాప్ సాయంతో బంగారం స్వచ్ఛతను చూసుకోవడమే కాకుండా దానిపై ఫిర్యాదులను కూడా రిజిస్టర్ చేయవచ్చు. లైసెన్స్, రిజిస్ట్రేషన్ అండ్ హాల్‌మార్క్ నంబర్ తప్పు అని తేలితే కస్టమర్లు వెంటనే ఈ యాప్ నుండి ఫిర్యాదు చేయవచ్చు. అలాగే  ఫిర్యాదు గురించిన సమాచారం కూడా పొందవచ్చు.

సాధారణంగా 24 క్యారెట్ల బంగారాన్ని స్వచ్ఛమైనదిగా పరిగణిస్తారు, అయితే ఈ బంగారం చాలా మృదువైనది కాబట్టి దీనితో నగలు తయారు చేయలేరు. అందుకే నగలు లేదా ఆభరణాల తయారీలో ఎక్కువగా 22 క్యారెట్ల బంగారాన్ని మాత్రమే ఉపయోగిస్తారు.

ఏ క్యారెట్ బంగారం స్వచ్ఛమైనది
24 క్యారెట్ల బంగారం 99.9 శాతం.
23 క్యారెట్ల బంగారం 95.8 శాతం.  
22 క్యారెట్ల బంగారం 91.6 శాతం.
21 క్యారెట్ల బంగారం 87.5 శాతం.
18 క్యారెట్ల బంగారం 75 శాతం.
17 క్యారెట్ల బంగారం 70.8 శాతం.  
14 క్యారెట్ల బంగారం 58.5 శాతం.
9 క్యారెట్ల బంగారం 37.5 శాతం.

ఇక  తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు బంగారం కొనేవారికి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఎందుకంటే శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో బంగారం ధర  ఒకరోజు పడిపోతు ఒకరోజు పెరుగుతూ షాకిస్తుంది. దీంతో బంగారం ధర ఏకంగా 7 నెలల గరిష్టానికి పెరిగింది. 

నేడు హైదరాబాద్‌లో పసిడి ధరల విషయానికొస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.750 పెరిగింది. దీంతో నిన్న రూ.48,000గా ఉన్న ధర ఈరోజు రూ.48,750కి చేరింది.  అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.820 పెరిగి రూ.53,180కి చేరింది.

కిలో వెండి ధర సుమారు రూ.1300 తగ్గి ప్రస్తుతం రూ.67,200కు చేరింది.  నిన్నటి వెండి ధర రూ.68,500గా ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 1764 డాలర్ల వద్ద, స్పాట్ సిల్వర్ ధర ఔన్సుకు 21 డాలర్ల వద్ద ఉంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.68 వద్ద ట్రేడవుతోంది.
 

PREV
click me!

Recommended Stories

ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రికీ తెలియ‌ని బిజినెస్ ఐడియా.. కాస్త తెలివిగా ఆలోచిస్తే నెల‌కు రూ. ల‌క్ష ప‌క్కా
Post office: రూ. 222తో రూ. 11 ల‌క్ష‌లు.. జ‌స్ట్ వ‌డ్డీ రూపంలోనే రూ. 3.8 ల‌క్ష‌లు పొందొచ్చు