
ఎలాన్ మస్క్ ట్విట్టర్ అధిపతి అయినప్పటి నుంచి ప్రతిరోజూ ఆ కంపెనీ గురించి అనేక వార్తలు మీడియాలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అవుతున్నాయి. ఇప్పటికే సంస్థలోని సగం మంది ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగిస్తూ మస్క్ నిర్ణయం తీసుకొని సంచలనానికి తెరలేపాడు. ఇదిలా ఉంటే తాజాగా ట్విట్టర్ కు సంబంధించిన వందలాది మంది ఉద్యోగులు సామూహికంగా రాజీనామాలు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్విట్టర్ కార్యాలయాలను మూసివేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ట్విట్టర్ 2.0లో తాము భాగస్వాములం కాలేము అంటూ, ఇప్పటికే ఉద్యోగులకు పంపిన గూగుల్ ఫారంలో నో ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని పలువురు ఉద్యోగులు సంస్థ లో ఉన్నట్లు తెలుస్తోంది.
ది న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం వందలాది మంది ఉద్యోగులు ఒకేసారి రాజీనామాలు చేయడంతో ట్విట్టర్ కార్యకలాపాలపై ఎఫెక్ట్ పడుతున్నట్లు తెలుస్తోంది. చాలామంది ఉద్యోగులు సోషల్ మీడియాలో తమ ఫేర్వెల్ మెసేసెస్ పోస్ట్ చేస్తున్నట్లు ఈ కథనంలో తెలిపింది. ప్రముఖ టెక్నాలజీ జర్నలిస్టు జో షిఫర్ ట్వీట్ చేస్తూట్విట్టర్ తన కార్యాలయాలు అన్నింటిని మూసి వేసిందని, తిరిగి నవంబర్ 21న మళ్లీ తెరుచుకుంటాయి అని రిపోర్ట్ చేశారు. ఇదిలా ఉంటే కొత్త బాస్ మాస్క్, అతని టీం పాత ఉద్యోగుల వ్యవహారశైలిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వారంతా సంస్థను దెబ్బ కొట్టేలా చేయాలని ప్రయత్నం చేస్తున్నారని అనుమానిస్తున్నట్లు జో షిఫర్ తెలిపారు.
ఇంతలో ట్విటర్ సంస్థ, ఫెడరల్ ట్రేడ్ కమీషన్ [FTC}కి విరుద్ధంగా నడుస్తూ ప్రమాదకరంగా ఉందని. ఈ రోజు తెల్లవారుజామున, ఏడుగురు డెమొక్రాటిక్ సెనేటర్లు ట్విట్టర్ తన వినియోగదారు గోప్యతా ఒప్పందాన్ని ఉల్లంఘించిందా లేదా అనే దానిపై దర్యాప్తు చేయాలని కోరుతూ ఏజెన్సీకి లేఖ పంపారు.
Twitter తన 7,500 మంది సభ్యుల వర్క్‌ఫోర్స్‌లో సగానికి పైగా రాజీనామా చేయడం లేదా తొలగించడంతో, ప్లాట్‌ఫారమ్ తిరిగి అంత మంది ఉద్యోగులను పొందగలదా అనేది అస్పష్టంగా ఉందని నిపుణులు చెబుతున్నారు.
“నా వాచ్ ట్విట్టర్ 1.0తో ముగుస్తుంది. నేను ట్విట్టర్ 2.0లో భాగం కావాలనుకోవడం లేదు” అని ఒక ఉద్యోగి పోస్ట్ చేసినట్లు ది వెర్జ్ వెబ్ పోర్టల్ తెలిపింది.